E-Paper
Advertisement

‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్ ఎవరో తెలుసా?.. ఈ పేరు వింటే షాక్ అవుతారు!

‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్ ఎవరో తెలుసా?.. ఈ పేరు వింటే షాక్ అవుతారు!
Advertisement

Prabhas Mother in Fauji?: ప్రభాస్ సినిమా అంటే చాలు.. చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలాంటి ఓ వార్తే ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ’గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్‌కు అమ్మగా సీనియర్ నటి జయప్రద కనిపించబోతున్నారట.

ప్రభాస్‌కు అమ్మగా …

Advertisement

ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫిల్మ్ నగర్‌లో మాత్రం ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల జయప్రద కూడా ఓ కార్యక్రమంలో ‘ఫౌజీ’లో నటిస్తున్నానని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అయితే “ప్రభాస్‌కు అమ్మగా జయప్రద” అంటూ పోస్టులు వరుసగా కనిపిస్తున్నాయి కూడా.

హను రాఘవపూడి సినిమాలు చూస్తే  ఆయన కథల్లో ఎమోషన్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థమవుతుంది.అందుకే ఈ సినిమాలో కూడా తల్లి-కొడుకు బంధాన్ని చాలా బలంగా చూపించబోతున్నారని టాక్. ఒకవేళ నిజంగానే జయప్రద ఆ పాత్ర చేస్తే.. ప్రభాస్‌తో ఆమెకు ఉండే సీన్స్ సినిమాకు పెద్ద హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట

Advertisement

కృష్ణంరాజు, జయప్రద కాంబినేషన్ సూపర్ హిట్

నిజానికి  ఒకప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు, జయప్రద కాంబినేషన్ అంటే బాక్సాఫీస్‌లో సూపర్ హిట్ అనే పేరు ఉండేది. ‘మధుర స్వప్నం’, ‘సీతారాములు’, ‘అగ్ని పూలు’, ‘రంగూన్ రౌడీ’, ‘కురుక్షేత్రం’, ‘ప్రళయ రుద్రుడు’, ‘సర్దార్’, ‘అడవి సింహాలు’, ‘తాండ్ర పాపారాయుడు’ ఇలా ఎన్నో సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు అదే జయప్రద… కృష్ణంరాజు వారసుడు ప్రభాస్‌కు తల్లిగా కనిపించనున్నారనే వార్త రావడంతో మురిసిపోతున్నారు రెబల్ ఫ్యాన్స్.

ఇక ఫౌజీ విషయానికి వస్తే ఈ  సినిమా 1970ల నాటి వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కొత్త హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఆగస్టు 14 లేదా 15న ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ గ్లింప్స్

ఇదిలా ఉంటే అభిమానులకు త్వరలోనే మరో ట్రీట్ కూడా ఉండొచ్చని టాక్. ఆగస్టు 14 లేదా 15న ‘ఫౌజీ’ నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట. ఇందులో ప్రభాస్ లుక్‌తో పాటు సినిమా విజువల్ స్టైల్, వార్ సీన్స్‌కు సంబంధించిన ఒక లుక్ఇ బయటికి వదలబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఫ్యాన్స్ కూడా ఆ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉండబోతున్నాయని యూనిట్‌కు దగ్గరగా ఉన్నవాళ్లు చెబుతున్నమాట.

also read :సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు

అయితే జయప్రద ప్రభాస్‌కు తల్లిగా నటిస్తున్నారనే వార్త మేకర్స్ నుండి అఫీషియల్ గా అయితే అనౌన్స్ కాలేదు. చూడాలి ముందు ముందు ఏమైనా రివీల్ చేస్తారో !

Related News

‘ఎల్లమ్మ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎప్పుడంటే..?

సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు

దుమ్ములేపుతున్న’స్పైడర్ మ్యాన్’..రెండు రోజుల్లో వచ్చిందెంతో తెలుసా ?

ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్..? ఎట్టకేలకు నోరు విప్పిన అనుపమ!

మా నాన్న విజయ్ తో హాలీవుడ్ మూవీ తీస్తా – జేసన్ సంజయ్

అఖిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లెనిన్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Big Stories

Advertisement
×