E-Paper
Advertisement

స్నేహాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు.. ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన 10 సాంగ్స్

స్నేహాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు.. ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన 10 సాంగ్స్
Advertisement

Best Telugu Friendship Songs:స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితంలో ఎన్నో బంధాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ చిన్ననాటి నుంచి మనతో కలిసి నడిచే స్నేహం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. అందుకే సినిమాల్లో కూడా ఫ్రెండ్‌షిప్‌ను చూపించే పాటలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. కొన్ని పాటలు కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. మన జీవితంలోని అందమైన క్షణాలను గుర్తు చేసే జ్ఞాపకాలుగా మారిపోతాయి.

తెలుగు సినిమాల్లో కూడా స్నేహం గొప్పతనాన్ని చెప్పే ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. అందులో కొన్ని పాటలు ఇప్పటికీ ఫ్రెండ్‌షిప్ డే అయినా, ఫ్రెండ్స్‌తో కలిసిన సందర్భమైనా తప్పకుండా వినిపిస్తూనే ఉంటాయి.మరి ఆ పాటలు ఏంటో ఒకసారి చూసేద్దాం.

Advertisement

1.ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి – స్టూడెంట్ నెం.1

యువతలో స్నేహం, కాలేజ్ లైఫ్‌కు మంచి కనెక్షన్ ఇచ్చిన పాటల్లో ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ ఒకటి. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒకే చోట కలుసుకుని మంచి స్నేహితులుగా మారే ప్రయాణాన్ని ఈ పాట గుర్తు చేస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా అప్పటి యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ పాటలో ఉన్న ఫ్రెండ్‌షిప్ ఫీల్ ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది.

Advertisement

 2. దోస్త్ మేరా దోస్త్ – హ్యాపీ

అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ సినిమాలోని ఈ పాట యూత్‌లో అప్పట్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. కాలేజ్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో చేసే అల్లరి, సరదా క్షణాలు, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఈ పాట గుర్తు చేస్తుంది.మణిశర్మ అందించిన సంగీతం, పాటలోని ఫ్రెండ్‌షిప్ ఫీల్ కారణంగా ఇది ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటుంది. ఎంత కాలం గడిచినా ఫ్రెండ్స్‌తో కలిసి ఈ పాట వింటే పాత రోజులు గుర్తుకు రావడం ఖాయం.

3. ముస్తఫా ముస్తఫా – ప్రేమదేశం

స్నేహం పాటలు అనగానే మొదట గుర్తొచ్చే పాటల్లో ‘ముస్తఫా ముస్తఫా’ తప్పకుండా ఉంటుంది. కాలేజ్ జీవితంలో ఫేర్‌వెల్ పార్టీలకు ఈ పాట ఓ ఎమోషనల్ సింబల్‌గా మారిపోయింది.ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించిన విధానం ఈ పాటను ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిపాయి. స్నేహితులు విడిపోతున్న సమయంలో వచ్చే ఎమోషన్‌ను ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది.

 4. దోస్తీ – RRR

రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘RRR’ సినిమాలోని ఈ పాట స్నేహానికి ఓ కొత్త డెఫినేషన్ ని ఇచ్చింది.ఇద్దరు భిన్నమైన వ్యక్తులు ఎలా ప్రాణ స్నేహితులుగా మారుతారో ఈ పాటలో ఎంతో గొప్పగా చూపించారు మన జక్కన్న.కీరవాణి అందించిన సంగీతం, పాటలోని ఎమోషన్ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మెప్పు పొందింది.

5. నీ స్నేహం – నీ స్నేహం

స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం కాదు.. జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం అనే విషయాన్ని చెప్పిన పాట ఇది. ‘నీ స్నేహం’ సినిమాలోని ఈ సాంగ్ స్నేహితుడి విలువను ఎంతో గొప్పగా  చూపిస్తుంది.ఆర్పీ పట్నాయక్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ పాటకు మరింత బలాన్ని ఇచ్చాయి. నిజమైన స్నేహం ఉన్న వాళ్లకు ఈ పాటలోని ప్రతి లైన్ మనసుకు తాకుతుందనడంలో సందేహం లేదు.

6. మైత్రి చెరిపేయలేనిది – మహర్షి

స్నేహం ఎప్పటికీ చెరిగిపోదు అనే భావనను చూపించిన పాట ఇది. జీవితంలో ఎంత ఎదిగినా, ఎంత దూరం వెళ్లినా మనతో కలిసి నడిచిన స్నేహితులను మర్చిపోకూడదనే సందేశం ఈ పాటలో కనిపిస్తుంది.స్నేహం అంటే అవసరానికి మాత్రమే ఉండే బంధం కాదు.. జీవితాంతం గుర్తుండిపోయే అనుబంధం అని ఈ పాట గుర్తు చేస్తుంది.

7. జమానా మారినా – రామసక్కనోడు

కాలం మారినా.. పరిస్థితులు మారినా.. నిజమైన స్నేహం మాత్రం మారదనే భావనను చెప్పిన పాట ఇది. పాత తరం ప్రేక్షకులకు ఈ పాట ఇప్పటికీ ఎంతో ప్రత్యేకమైనది.స్నేహంలో ఉండాల్సిన నమ్మకం, అనుబంధం గురించి ఈ పాట చక్కగా చెబుతుంది.

also read :సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు

 8. ఒరేయ్ దోస్త్ – జోష్

నాగచైతన్య నటించిన ‘జోష్’ సినిమాలోని ఈ పాట యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. ఫ్రెండ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే స్నేహితుడి మనస్తత్వాన్ని ఈ పాటలో చూడొచ్చు.కాలేజ్ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసే ఆ ఎనర్జీ ఈ పాటలో కనిపిస్తుంది.సందీప్ చౌతా ఇచ్చిన ఈ ఆల్బమ్ అప్పట్లో ఒక సెన్సేషన్.

 9. లాలిజో లాలిజో – స్నేహం కోసం

చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ సినిమాలోని ఈ పాట స్నేహం కోసం చేసే త్యాగాన్ని చూపిస్తుంది. నిజమైన స్నేహితుడు అవసరమైన సమయంలో ఎంతటి అండగా నిలుస్తాడో ఈ పాట గుర్తు చేస్తుంది.ఎమోషనల్‌గా సాగే ఈ పాట స్నేహం గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేస్తుంది.

 10. ఓ మై ఫ్రెండ్ – ఓ మై ఫ్రెండ్

స్నేహంలో ఉండే స్వచ్ఛతను అందంగా చూపించిన పాట ఇది. అబ్బాయి, అమ్మాయి మధ్య కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మంచి స్నేహం ఉండొచ్చని ఈ పాట చెబుతుంది.స్నేహం అంటే ఒకరి జీవితంలో మరొకరు ఇచ్చే విలువైన స్థానం అని ఈ పాట గుర్తు చేస్తుంది.

ఒక్కసారి ఈ పాటలు వింటే చాలు.. మనసు తెలియకుండానే చిన్ననాటి రోజుల్లోకి, కాలేజ్ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది.మరి ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీ బెస్ట్ ఫ్రెండ్‌ను గుర్తు చేసుకుని ఈ పాటలు వింటూ వింటారు కదూ !

also read :‘ఎల్లమ్మ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎప్పుడంటే..?

Tags

Related News

‘ఎల్లమ్మ’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఎప్పుడంటే..?

‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్ ఎవరో తెలుసా?.. ఈ పేరు వింటే షాక్ అవుతారు!

సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు

దుమ్ములేపుతున్న’స్పైడర్ మ్యాన్’..రెండు రోజుల్లో వచ్చిందెంతో తెలుసా ?

ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్..? ఎట్టకేలకు నోరు విప్పిన అనుపమ!

మా నాన్న విజయ్ తో హాలీవుడ్ మూవీ తీస్తా – జేసన్ సంజయ్

అఖిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లెనిన్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×