Balakrishna Comments: రెంటల్ vs పర్సెంటేజ్ పంచాయితీ ఇంకా కంటిన్యూ అవుతుండగానే సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చాడు నందమూరి బాలయ్య. విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (APFDC) నూతన సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం విజయవాడ వేదికగా జరిగిన సంగతి తెల్సిందే.
సెన్సేషన్ కామెంట్స్ చేసిన నందమూరి బాలకృష్ణ
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన సెన్సేషన్ కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాను మనం బతికించుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి వచ్చిందని, ఎగ్జిబిటర్ల కష్టాలు చూస్తుంటే తనకు చాలా జాలేస్తోందని మనసులోని బాధని బయట పెట్టారు. థియేటర్లకు తాళాలు వేసే దుస్థితి రావడం నిజంగా బాధాకరమని, కొన్ని చోట్ల థియేటర్లని మెయింటెనెన్స్ చేయలేక షోలు వేయలేకపోతున్నారనిపేర్కొన్నారు. అయితే ఇకపై ఇలాంటి దుస్థితి రాకూడదని, ఎగ్జిబిషన్ సెక్టార్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుని అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కోరుకున్నారు.
also read :డబ్బు లేదనే చెప్పుతో కొట్టాడు.. ఆ కసితోనే కోట్లు సంపాదించా.. బండ్ల గణేష్ ఓపెన్ టాక్
కేవలం పెద్ద సినిమాలపైనే ఆధారపడితే అంతే
ఇక ప్రస్తుతం ఉన్న ఈ సంక్షోభం నుంచి మూవీ ఇండస్ట్రీ బయటపడాలంటే ఎక్కువ సినిమాలు థియేటర్ లలోకి వచ్చేలా కృషి చేయాలని అంతే తప్ప కేవలం పెద్ద సినిమాలపైనే ఆధారపడటం మంచిది కాదంటూ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించాలంటే వాళ్ళని ఎంటర్ టైనింగ్ గా ఉంచే మరింత మంచి కంటెంట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో పెరిగిపోతున్న టెక్నాలజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చాడు బాలయ్య. ఈ రోజుల్లో ఇండస్ట్రీలో టెక్నాలజీ చాలా పెరిగిందని, దీనివల్ల విజువల్ క్వాలిటీ అద్భుతంగా వస్తున్నప్పటికీ.. సినిమాలు ఏళ్ల కొద్ది టైమ్ తీసుకుంటున్నాయని గుర్తుచేశారు.
also read :టాలీవుడ్‌లో మొదలైన అసలు ‘సినిమా’.. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్.. ‘పెద్ది’ రిలీజ్ అవుతుందా?
ఫలితంగా సినిమాలు విడుదల కావడం చాలా ఆలస్యమవుతోందని, ఈ గ్యాప్ వల్ల థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని విశ్లేషించారు. టెక్నాలజీని వాడుకుంటూనే మేకింగ్ సమయాన్ని తగ్గించి, ఎక్కువ సంఖ్యలో సినిమాలను ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత మేకర్స్‌పై ఉందన్నారు బాలయ్య.
రెండు తెలుగు రాష్ట్రాల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి
ఇండస్ట్రీ పదికాలాల పాటు పచ్చగా ఉండాలంటే రెండు తెలుగు రాష్ట్రాల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పిన బాలకృష్ణ, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అదే సమయంలో పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు పూర్తి అండగా నిలవాలని ఈ వేదిక ద్వారా బహిరంగంగా కోరారు. ఇండస్ట్రీని ఆదుకునేలా, ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించేలా తెలంగాణ సర్కార్ సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆ తర్వాత టికెట్ ధరల వ్యవహారంలోనూ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలతో జరిపిన చర్చలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.
ఎలాంటి సంచలన మార్పులు వస్తాయో
త్వరలోనే ఎన్‌బీకే 111(NBK 111) చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్న బాలకృష్ణ, సినిమా ఇండస్ట్రీ మనుగడపై ఇంతటి లోతైన అనాలసిస్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, థియేటర్ల నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది కార్మికులు, ఎగ్జిబిటర్ల పక్షాన నిలబడిన బాలయ్యని ఆకాశానికి ఎత్తేస్తున్నారంతా.చూడాలి మరి APFDC నూతన కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలన మార్పులు వస్తాయో.
also read :వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్.. 10 ఏళ్లలో 55 ట్రాన్స్‌ఫర్లు.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ అరాచకం!