Friendship Movies: ఇప్పుడొచ్చే సినిమాల్లో విజువల్స్, యాక్షన్, భారీ బడ్జెట్ అన్నీ ఉంటాయి. కానీ 90s, 2000sలో వచ్చిన కొన్ని సినిమాల్లో మాత్రం ఓ మ్యాజిక్ ఉండేది. ముఖ్యంగా ఫ్రెండ్‌షిప్, కాలేజ్ లైఫ్, మొదటి ప్రేమ, గ్యాంగ్ అల్లరి.. ఇవన్నీ చాలా సహజంగా చూపించేవారు అప్పటి దర్శకులు.అందుకే ఆ సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసేస్తుంటారు.
ప్రేమ దేశం
ఈ లిస్ట్‌లో మొదట చెప్పుకోవాల్సిన సినిమా ప్రేమ దేశం. అబ్బాస్, వినీత్, టబు నటించిన ఈ సినిమా అప్పట్లో యూత్‌ను ఊపేసింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత వాళ్ల మధ్య జరిగే సంఘటనలు, చివరికి స్నేహం విలువను చెప్పే క్లైమాక్స్ ఇప్పటికీ ప్రేక్షకులను కదిలిస్తుంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాను మరో లెవెల్ లో పెట్టేసింది.
నువ్వే కావాలి
ఆ తర్వాత గుర్తొచ్చే సినిమా నువ్వే కావాలి. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా పెరిగిన ఇద్దరికి, ఎప్పుడో ఒక రోజు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందని అర్థమయ్యే కథ. ఈ సినిమా చూసిన తర్వాత “బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుందేమో” అనిపించిన వాళ్లు బోలెడు.
ఆనందం
ఈ సినిమా అయితే కాలేజ్ లైఫ్‌ను చాలా అందంగా చూపించింది. ఫ్రెండ్స్‌తో కాంటీన్‌లో కూర్చోవడం, క్లాస్ బంక్ కొట్టడం, చిన్న చిన్న గొడవలు, ప్రేమలు… ఇవన్నీ చాలా సహజంగా అనిపిస్తాయి. అందుకే ఈ సినిమా ఇప్పటికీ యూత్ ఫేవరెట్‌గా ఉంటుంది.
స్నేహమంటే ఇదేరా
స్నేహమంటే ఇదేరా సినిమాలో స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఇద్దరు మిత్రుల కథ ఉంటుంది. నిజమైన ఫ్రెండ్ అంటే కష్టాల్లో ముందుగా గుర్తొచ్చే వ్యక్తి అనే విషయాన్ని ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా చెబుతుంది.
వసంతం
వసంతం కూడా స్నేహం, ప్రేమ, త్యాగం కలిసిన ఒక అందమైన కథ. ఫ్రెండ్ సంతోషం కోసం తన ప్రేమను కూడా పక్కన పెట్టే పాత్రలు ఈ రోజుల్లో చాలా రేర్ గా కనిపిస్తాయి. అందుకే ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి ఒక మంచి మెమొరీ.
ఆర్య
ఆర్య సినిమా వచ్చిన తర్వాత ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పే విధానం పూర్తిగా మారిపోయిందంటే ఆశ్చర్యం లేదు.”ప్రేమ అంటే దక్కించుకోవడం కాదు… ఎదుటివారు సంతోషంగా ఉండటం” అనే పాయింట్ ని చాలా కొత్తగా చూపించారు.ఇక అల్లు అర్జున్ నటన, డైలాగ్స్ ఇప్పటికీ గుర్తుండిపోతాయి.ఈ దర్శకుడే తర్వాత పుష్ప తీసిన సుక్కు.
వెన్నెల
వెన్నెల సినిమా విదేశాల్లో చదివే తెలుగు యూత్ లైఫ్ స్టైల్ , వాళ్ల మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్, సరదా, ప్రేమను చాలా న్యాచురల్‌గా చూపించింది. ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ప్రతి సీన్‌కు కనెక్ట్ అవుతారు.కాలేజ్ ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడితే హ్యాపీ డేస్ను మర్చిపోలేం. కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్, ర్యాగింగ్, ల్యాబ్స్, కల్చరల్స్, ఫేర్‌వెల్… ఒక స్టూడెంట్ లైఫ్‌లో ఉండే ప్రతి మూమెంట్ ఈ సినిమాలో ఉంటుంది. అందుకే ఇది కేవలం సినిమా కాదు.. ఒక జనరేషన్‌కు మెమరీ.
also read :స్నేహాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు.. ప్లేలిస్ట్‌లో ఉండాల్సిన 10 సాంగ్స్
కొత్త బంగారు లోకం
కొత్త బంగారు లోకం కూడా స్కూల్ రోజుల అమాయక ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలను చాలా బాగా చూపించింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది తమ స్కూల్ ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు.
జోష్
జోష్ సినిమా స్టూడెంట్ లీడర్‌షిప్, కాలేజ్ పాలిటిక్స్, ఫ్రెండ్‌షిప్ చుట్టూ తిరుగుతుంది. యూత్‌కు మంచి మెసేజ్ ఇవ్వడంతో పాటు ఎంటర్‌టైన్ కూడా చేస్తుంది.ఇక ఈ సినిమానే అక్కినేని నాగ చైతన్యకి మొదటి సినిమా.
ఈ సినిమాలన్నింటిలో కామన్‌గా కనిపించే విషయం ఒక్కటే. అప్పట్లో సోషల్ మీడియా లేదు… రీల్స్ లేవు… స్టేటస్‌లు లేవు. కానీ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. కలిసి సైకిళ్లపై తిరగడం, కాంటీన్‌లో ఒక టీని నలుగురు పంచుకుని తాగడం, సినిమా కోసం క్లాస్ బంక్ కొట్టడం, ఒక ఫ్రెండ్‌కు ప్రేమ విషయం చెప్పడానికి మొత్తం గ్యాంగ్ వెళ్లడం… ఇలాంటి చిన్న చిన్న విషయాలే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారాయి.
అందుకే 90s, 2000sలో వచ్చిన ఈ సినిమాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి
also read :సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు