E-Paper
Advertisement

దుమ్ములేపుతున్న’స్పైడర్ మ్యాన్’..రెండు రోజుల్లో వచ్చిందెంతో తెలుసా ?

దుమ్ములేపుతున్న’స్పైడర్ మ్యాన్’..రెండు రోజుల్లో వచ్చిందెంతో తెలుసా ?
Advertisement

Spider-Man Collection: ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్ళు తెలేస్తుంటే ఇంగ్లీష్ సినిమాలు మాత్రం అదరగొడుతున్నాయి.మొన్నటికి మొన్న అబ్సెషన్, ది ఒడిస్సీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విశ్వ రూపం చూపెట్టగా ఇపుడు అదే బాటలో నడుస్తుంది లేటెస్ట్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ .అవును …రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఏకంగా రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది మరి.హాలీవుడ్ సినిమా అయినా సరే.. ఇండియన్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారంటే సినిమా ఎంతలా ఆకట్టుకుందో అర్థమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కంటే ముందే ఈ సినిమాను భారత్‌లో విడుదల చేయడంతో  ఖుషీ అయ్యారు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్.ఇక మొదటి షో నుంచే సినిమాకు సూపర్ టాక్ రావడంతో థియేటర్ల దగ్గర సందడి బాగా కనిపించింది. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టడంతో  చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి.ఇక వీకెండ్ కూడా కలిసి రావడంతో టికెట్లు దొరకడం కూడా కష్టంగా మారిందన్న టాక్ వినిపిస్తుంది.

Advertisement

also read :ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్..? ఎట్టకేలకు నోరు విప్పిన అనుపమ!

ఇండియాలో రూ.72.44 కోట్ల గ్రాస్

Advertisement

ఇక మేకర్స్ విడుదల చేసిన   లెక్కల ప్రకారం.. మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో రూ.72.44 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ మరో రూ.59.02 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇలా కేవలం రెండు రోజుల్లోనే రూ.131.46 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా 3డీ షోలు చూసిన ప్రేక్షకులు విజువల్స్ అదిరిపోయాయని, యాక్షన్ సీన్లు థియేటర్‌లో చూస్తేనే అసలు కిక్ వస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్.

బాగా కనెక్ట్ అవుతున్న ఎమోషనల్ మూమెంట్స్ 

ఈ సినిమాలో టామ్ హాలండ్ మరోసారి తన నటనతో ఆకట్టుకోగా.. జెండయా, జాకబ్ బటాలాన్, సాడీ సింక్ తమ పాత్రల్లో బాగా మెప్పించారు. దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తున్నాయి. అందుకే సినిమా చూసిన వాళ్లు పాజిటివ్ టాక్‌ను మరింత వైరల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ల నుంచి మొదలుకుని ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరూ మంచి రివ్యూలు ఇస్తున్నారు. స్పైడర్ మ్యాన్ ఎంట్రీ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ గురించి అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. థియేటర్లలో అభిమానుల హంగామాకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు అందరి చూపు వీకెండ్ కలెక్షన్లపైనే ఉంది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా ఇండియాలోనే మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ మాట. ఇప్పటికే రెండు రోజుల్లో రూ.131 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.ఇక ఈ జోరు చూస్తుంటే అబ్సెషన్ , ది ఒడిస్సీ లాగే ఈ సినిమా కూడా రికార్డులు సెట్ చేసేలానే ఉంది .చూడాలి ముందు ముందు ఏం జరగనుందో !

Related News

సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే 15 బెస్ట్ ఫ్రెండ్ పాత్రలు

ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్..? ఎట్టకేలకు నోరు విప్పిన అనుపమ!

మా నాన్న విజయ్ తో హాలీవుడ్ మూవీ తీస్తా – జేసన్ సంజయ్

అఖిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లెనిన్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

ట్రైలర్‌తో ఆశలు పెంచిన వరుణ్.. రిజల్ట్ ఎలా ఉంటుందో అంటూ టెన్షన్!

‘క్రేజీ కళ్యాణం’ టీజర్.. కూతురి పెళ్లిగోల, దరిద్రమైన అల్లుడు రావాలని కోరే తండ్రి!

Big Stories

Advertisement
×