Ananya Nagalla:అనన్య నాగళ్ల..తెలుగు అమ్మాయిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ కెరీర్ మొదట్లో వరుస ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ ఆ తర్వాత ఎందుకో జోరు తగ్గించింది.అయితేనేం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస అప్ డేట్స్ ని ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంది.ఇదిగో ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక పిక్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఒక షాపింగ్ మాల్‌లోని ఫుడ్ కోర్టులో కూర్చున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అనన్య. ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో చాలా సింపుల్‌గా, క్యూట్‌గా కనిపిస్తూ కెమెరాకు ఫోజిస్తూ దిగిన ఫోటోలని ఇలా సోషల్ మీడియాలో వదలడంతో ఫిదా అయిపోయారు ఫాలోవర్స్.
ఇకఈ ఫొటోను షేర్ చేస్తూ ‘Guess the expression?’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఇక్కడ హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.తన ఫేస్‌లో కనిపిస్తున్న ఎక్స్‌ప్రెషన్ ఏంటో కనిపెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు ఒక టాస్క్ ఇచ్చినట్టుగా ఈ క్యాప్షన్ ఉండటంతో తమ రియాక్షన్స్ ని కామెంట్ల రూపంలో బయటపెట్టారు ఫ్యాన్స్.
నిజానికి అనన్య నాగళ్ల కేవలం అందంతోనే కాకుండా తన యాక్టింగ్‌తో కూడా మంచి పేరు తెచ్చుకుంది. మొదటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన’మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’లో దివ్య నాయక్ పాత్రలో కనిపించి అంజలి, నివేదా థామస్‌లతో పోటాపోటీగా నటించి మెప్పించింది.ఇక ‘ప్లేబ్యాక్’, ‘మాస్ట్రో’ వంటి సినిమాల్లోనూ వెరైటీ పాత్రలు పోషించి తాను గ్లామర్ పాత్రలకే పరిమితం కాదని ప్రూవ్ చేసుకుంది .
ఇక ఆ తర్వాత ‘శాకుంతలం’, ‘మళ్లీ పెళ్లి’, ‘అన్వేషి’ సినిమాలతో అలరించిన అనన్య ప్రియదర్శి, నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’లో డాక్టర్ నందినిగా ,హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘తంత్ర’లో రేఖగా నటించి తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టింది.ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘పొట్టేల్’లో బుజ్జమ్మ పాత్రలో నటించి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో ప్రత్యేక జ్యూరీ ఉత్తమ నటి అవార్డు దక్కించుకోవడం విశేషం .
ఇక ఈ క్రమంలోనే ‘బూట్‌కట్ బాలరాజు’, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమాల్లో కనిపించిన అనన్య ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లోనూ నటించి మెప్పించడం విశేషం.ఇక ఈ ఏడు వచ్చిన ‘లేచింది మహిళా లోకం’ సినిమాలో నిర్మల పాత్రలో తళుక్కుమన్న అనన్య మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టినట్టే కనిపిస్తుంది.
మొత్తంగా ఒకవైపు సినిమాలలో వేగం పెంచుతూనే మరో వైపు, సినిమా ప్రమోషన్లు , ట్రావెల్ మూమెంట్స్, ఫోటోషూట్స్ వంటి క్రేజీ అప్ డేట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.చూడాలి మరి తాజాగా ‘Guess the expression?’ అంటూ ఆమె వేసిన క్వశ్చన్‌కు ఫ్యాన్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో !