January 12 Vidudala Movie: టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. ఇలా సంక్రాంతి పండుగ సందర్భంగా మరోసారి సక్సెస్ అందుకోవడానికి అనిల్ రావిపూడి(Anil Ravipudi ) సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,(Venkatesh) నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram Nandamuri) హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “జనవరి 12 విడుదల”(January12 Vidudala Movie). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి అయ్యాయని తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టారు. డబ్బింగ్ పనులు ప్రారంభించిన నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ డబ్బింగ్ పనులను ప్రారంభించారు ఇందుకు సంబంధించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేస్తూ..ఈ సంక్రాంతికి…పండగ గట్టిగుంటాది అంటూ వీడియో విడుదల చేశారు. ఇలా ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు డబ్బింగ్ పనులను కూడా నిర్వహిస్తూ అనిల్ రావిపూడి స్పీడు పెంచారు.
జనవరి 12 విడుదల సినిమా అనుకున్న ప్రకారం విడుదల చేయాలనే నేపథ్యంలో అనిల్ రావిపూడి పనులను వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ బావ బావమరిది పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్లుగా కృతి శెట్టి, కీర్తి సురేష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి డివికి..డివికి అనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ఈ పాటకు విపరీతమైన క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. వదిన మరదలు నేపథ్యంలో కొనసాగుతున్న ఈ పాటకు భారీ స్థాయిలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Andddd! @NANDAMURIKALYAN begins dubbing for #January12Vidudala 💥
ఈ సంక్రాంతికి…పండగ గట్టిగుంటాది! 🔥
Grand Worldwide Release on JANUARY 12th, 2027 ✨ pic.twitter.com/BQfrS9AbYI
— Shine Screens (@Shine_Screens) November 27, 2026
ఈ ఏడాది అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి 12 విడుదల సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది . ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
Also Read: జపాన్ లో ‘లెనిన్’ రిలీజ్… ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్..