Aishwarya Rai: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన ఈమె ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారు. ఇక ఐశ్వర్యరాయ్ మరో ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్(Abhisekh Bachchan) తో కలిసి ఏడు అడుగులు నచ్చిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan) అనే కుమార్తె ఉన్నారు. ఇక వీరిద్దరి తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల ఈ జంట విడివిడిగా కనిపించిన నేపథ్యంలో ఇద్దరు విడాకులు తీసుకున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
ఐశ్వర్యరాయ్ మా అమ్మ..
ఇలా ఐశ్వర్య అభిషేక్ విడాకుల గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలకు చెక్ పెడుతూ అభిషేక్ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా ఐశ్వర్యరాయ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఐశ్వర్యరాయ్ మా అమ్మ అంటూ ఏపీకి చెందిన ఓ కుర్రాడు ఊహించని షాక్ ఇచ్చారు. అంతేకాకుండా ఐశ్వర్య మా అమ్మ అనడానికి ఆధారాలు కూడా ఇవే అంటూ పలు ఆధారాలను కూడా చూపించారు. ఐశ్వర్యరాయ్ మా అమ్మ అంటూ ఏపీకి చెందిన సంగీత కుమార్(Sangeeth Kumar) అనే కుర్రాడు మీడియా ముందుకు వస్తూ తన ఫోన్ లో ఒక ఫోటోని చూపిస్తూ ఐశ్వర్య మా అమ్మ అనడానికి ఇదే ఆధారమని తెలియజేశారు.
ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చిందంటూ?
ఐశ్వర్యరాయ్ 15 ఏళ్ల క్రితం లండన్ లో ఐవీఎఫ్ ద్వారా తనకు జన్మనిచ్చిందనీ సంగీత్ కుమార్ తెలియజేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. బ్రో ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కాదు మమ్మల్ని పూల్స్ చేయడానికి అంటూ సదురు కుర్రాడి వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఓ జంట కోలీవుడ్ హీరో ధనుష్ మా అబ్బాయి అంటూ కోర్టుకు వెళ్లి అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా సెలబ్రిటీలు మా పిల్లలని, మా తల్లిదండ్రులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఆరాధ్య బచ్చన్…
ఇక సంతోష్ కుమార్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. నువ్వు ఐశ్వర్యరాయ్ కుమారుడు అయితే మరి ఆరాధ్య బచ్చన్ ఎవరు అంటూ కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఇక ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ల వివాహం 2007వ సంవత్సరంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ దంపతులకు కేవలం ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె మాత్రమే ఉన్నారు. ఇక ఇటీవల ఐశ్వర్య సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ అభిషేక్ మాత్రం పలు సినిమాలలోను నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఆరాధ్య ప్రస్తుతం సెకండరీ స్కూల్ చదువుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె తన తల్లి బాటలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని అభిమానులు అందరూ భావిస్తున్నారు కానీ ఇప్పటివరకు తన కుమార్తె భవిష్యత్తు గురించి ఐశ్వర్య కానీ అభిషేక్ బచ్చన్ కానీ ఎక్కడ స్పందించలేదు.
Also Read: HBD Mrunal Thakur: సీరియల్ లో హీరోయిన్ చెల్లిగా ఎంట్రీ.. కట్ చేస్తే ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్!