HBD Mrunal Thakur: సినీ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా తెలుగు హిందీ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న వారిలో నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం(Sitaramam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా సీత పాత్రలో నటించిన మృణాల్ కు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది.
పుట్టినరోజు ప్రత్యేకం…
ఇకపోతే ఆగస్టు 1వ తేదీ మృణాల్ తన 34వ పుట్టినరోజు (Birthday)వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అభిమానులు కూడా ఈమెకు సంబంధించి కొన్ని రేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా మృణాల్ పుట్టినరోజు సందర్భంగా ఈమె సినీ జర్నీకి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
వట్టిదండు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ…
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ ఈమె కెరియర్ మాత్రం బుల్లితెర పైన ప్రసారమైందని తెలుస్తోంది.2012లో ‘ముజ్ సే కుచ్ కెహెతి.. యే కామోషీయన్’ (Mujhse Kuch Keheti Ye Khamoshiyan) అనే టీవీ సీరియల్ ద్వారా తన కెరియర్ ప్రారంభించింది ఈ సీరియల్ లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించిన మృణాల్ తదుపరి ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె మొట్టమొదట మరాఠీలో సినిమా అవకాశాలను అందుకున్నారు.”వట్టిదండు” అనే మరాఠి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అనంతరం 2018 సంవత్సరంలో ‘లవ్ సోనియా’ (Love Sonia)అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది.
మృణాల్ నికర ఆస్తుల విలువ…
ఇలా పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న మృణాల్ తెలుగులో సీతారామం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తెలుగులో మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు అనంతరం హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ (Dacoit)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు సుమారు రూ. 4 నుంచి 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. పలు నివేదికల ప్రకారం మృణాల్ నికర ఆస్తుల విలువ 33 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. హోండా అకార్డ్, ఫార్చ్యూనర్,మెర్సిడెస్-బెంజ్ S-450 4MATIC వంటి విలువైన కార్లు తన గ్యారేజ్ లో ఉన్నాయి.
Also Read: AR Rahman: రామాయణ కోసం పురాతన రుద్రవీణ… గట్టిగానే ప్లాన్ చేస్తున్న రెహమాన్!