PC Ghosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. నివేదికను అధ్యయనం చేసి సారాంశాన్ని ఈ నెల 4న కేబినెట్‌కు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు అందజేశారు. నీటిపారుదల శాఖ సెక్రెటరీ ప్రశాంత్ పాటిల్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ నెల 4న నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్ కు సమర్పించనుంది.
ALSO READ: University of Hyderabad: గ్రేట్.. రూ.46లక్షల జీతంతో ఉద్యోగం.. ఇంకా 550 మందికి జాబ్స్..