BigTV English

Sudigali Sudheer: అందుకే సుధీర్‌తో అలా.. వేరే దారిలేదు.. అసలు సంగతి చెప్పేసిన అనిల్ రావిపూడి

Sudigali Sudheer: అందుకే సుధీర్‌తో అలా.. వేరే దారిలేదు.. అసలు సంగతి చెప్పేసిన అనిల్ రావిపూడి

Sudigali Sudheer:  బుల్లితెర మెగాస్టార్ సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో ఏదైనా సుధీర్ దిగనంతవరకే. ఒకసారి సుధీర్ దిగాడు అంటే ఎంటర్ టైన్మెంట్ పక్కా అని చెప్పొచ్చు. సింగింగ్, డ్యాన్స్, కామెడీ.. ఇలా ఏదైనా సరే సుధీర్ చిటికెలో చేసేస్తాడు అలానే ఫేమస్ అయ్యాడు కూడా. ఇక ఆ గుర్తింపుతో హీరోగా కూడా మారాడు. గాలోడు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీంతో సుధీర్ కి తిరుగులేదు అనుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ ఇక్కడే ఎదుగుతాడు అని అనుకున్నారు. సుధీర్ సైతం అలానే అనుకోని బుల్లితెర నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు. ఏ షోలో కానీ, ఛానెల్ లో కానీ కనిపించలేదు.


 

ఇక గాలోడు తరువాత సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా చేశాడు. ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా  గోట్ సినిమాను ప్రకటించాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్యాచిలర్ భామ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అభిమానులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు. పెద్ద ప్రాజెక్టు కావడంతో సుధీర్ దశ తిరిగింది అనుకున్నారు. కాని, సుధీర్ కు లక్ కలిసిరాలేదు. బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాత ఈ సినిమాను మధ్యలోనే ఆపేసాడని వార్తలు వచ్చాయి.


 

ఇక దీంతో చేసేది లేక సుధీర్ బ్యాక్ టూ బుల్లితెర వచ్చేశాడు. మళ్లీ టీవీ షోస్ చేసుకుంటూ బిజీగా మారాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో మూడు షోస్ ఉన్నాయి. అందులో ఒకటి డ్రామా జూనియర్స్. రోజా, అనిల్ రావిపూడి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షోకు సుధీర్ యాంకర్ గా మారాడు. అయితే మొదటి నుంచి కూడా సుధీర్ పై ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. అతడిపై గాసిప్స్ చెప్పడం, అమ్మాయిలతో తిరుగుతాడని, స్త్రీలోలుడు అని చెప్పుకొస్తారు. ఇక ఈ షోలో కూడా అనిల్ రావిపూడి, రోజా ఇద్దరు కూడా ఎప్పుడు సుధీర్ పై కౌంటర్లు వేస్తూనే ఉంటారు. చివరకి చిన్నపిల్లల చేత కూడా అతడిపై సెటైర్లు వేయిస్తున్నారు.

 

తాజాగా ఇదే విషయం గురించి అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అక్కడ కనిపించేది అంతా నిజం కాదు అని.. కొన్నిసార్లు మనసుకు కష్టంగా ఉన్నా కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. ” సుధీర్ నాకే దొరుకుతున్నాడు. అంతకుముందు కామెడీ స్టార్స్ లో కూడా నాకే దొరికాడు. ఆయన అంటే నాకు కోపం లేదు. కాకపోతే నాకు ఒక్కోసారి అతనిపై జాలేస్తుంది. అందరు కలిసి అతనిని ఫ్రై చేస్తుంటే. నేను చెప్తుంటా.. పాపం అయ్యా అతను హీరోగా కూడా సినిమాలు చేశాడు.. ఫ్రై చేయడం ఓకే నా అంటే.. ఫ్రై చేయడమే కాన్సెప్ట్ అని అంటున్నారు. ఇక మేము హెల్ప్ లెస్. కొన్ని మాకు ఇష్టం లేకపోయినా స్టేజిపై అనాల్సి వస్తుంది.

 

సుధీర్ ను ఎంత ఫ్రై చేస్తే జనాలు అంత ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. మేము ఎంత ఫ్రై చేసినా సుధీర్ ఫీల్ అవ్వడు. చాలా స్పోర్టివ్. ఎప్పుడైనా షో ద్వారా కామెడీని పంచుతున్నామా.. ? ఆ షోలో మనం ఎందుకు ఉన్నాం అనేది తెలిస్తే చాలు. ఎప్పుడైనా మేము మొహమాటపడినా.. పర్లేదు సార్ వేయండి అంటూ సుధీర్ నే చెప్పుకొస్తాడు.  కొన్ని చాలా లిమిట్ లేకుండా ఉంటాయి. వాటిని నేనే కట్ చేస్తా” అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Telugu Film Workers : సమ్మె విరమణ, సీఎం రేవంత్ రెడ్డి పై తెలుగు సినిమా ప్రముఖులు ప్రశంసల జల్లు

Tollywood cineworkers: ముగిసిన సినీ కార్మికుల సమ్మె, కాసేపట్లో ప్రెస్ మీట్

Mega 157 Glimpse: మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, టీజర్ అదిరింది. అసలైన మెగా ట్రీట్

TVK Maanadu: అడవికి రాజు ఒక్కడే, విజయ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ కి సెటైరా.?

Tollywood Films: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Big Stories

×