E-Paper
Advertisement

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!
Advertisement

Anil Ravipudi:వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకెళ్తూ హిట్ మెషీన్ గా పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకీ ,కళ్యాణ్ రామ్ కాంబోలో సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి తారక్ తో జోడీ కట్టబోతున్నాడు అన్న వార్తలు నెట్టింట్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఇదే విషయంపై గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో (IFFI 2026) పాల్గొన్న అనిల్ ఇలా చెప్పుకొచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తను డైరెక్ట్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ అవడం చాలా సంతోషంఅని చెప్పుకొచ్చాడు.అలాగే గతంలో 2019లో తన ‘ఎఫ్2’ సినిమాకు కూడా ఇలాంటి అరుదైన అవకాశం దక్కిందని గుర్తు చేసుకున్నాడు.ఇప్పుడు చిరంజీవి సినిమా ఇక్కడ స్క్రీనింగ్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తన మనసులోని మాటని బయట పెట్టాడు.

Advertisement

ఇక సినిమా రిలీజ్ టైంలో షూటింగ్ హడావిడి, ప్రమోషన్లు, కలెక్షన్ల టెన్షన్ వల్ల దర్శకుడికి సినిమాను ప్రశాంతంగా చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉండదని, కానీ గోవాలో ఆడియన్స్ మధ్య కూర్చుని సినిమా చూస్తుంటే థియేటర్లలో వచ్చినంత రెస్పాన్స్ రావడం చాలా సాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో చిరంజీవిని ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిలా చూపిస్తూనే, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే కామెడీ, డ్యాన్స్, ఎమోషన్స్‌ను సినిమాలో బ్లెండ్ చేయడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయిందని తెలిపాడు.చిరంజీవికి కథలపై మంచి పట్టు ఉంటుందని, పిల్లలు, వాళ్ల మధ్య ఉండే బంధాల చుట్టూ అల్లుకున్న ఈ కథ ఆయనకు బాగా నచ్చిందని చెప్పాడు. ఈ సినిమా కోసం చిరంజీవితో దాదాపు ఏడాది జర్నీ చేయడం ఒక గొప్ప అనుభవమని గుర్తు చేసుకున్నాడు.

Advertisement

గతంలో ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ సినిమాల్లో చిరంజీవి కామెడీ టైమింగ్ ఎలా ఆకట్టుకుందో, ఇందులో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి డ్యాన్స్ గురించి మాట్లాడుతూ, మంచి మ్యూజిక్, సౌండ్ కుదిరితే ఆయన స్క్రీన్ మీద కనిపించగానే పాటకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుందని ఆకాశానికి ఎత్తేశాడు.

ఇక సంక్రాంతి సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ, తాను వస్తున్నానంటే మిగతా నిర్మాతలు భయపడుతున్నారనే వార్తల్లో నిజం లేదని సంక్రాంతి అనేది టాలీవుడ్‌కు అతిపెద్ద సీజన్ అని, కంటెంట్ బాగుంటే ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ ఆదరిస్తారని చెప్పాడు. తన సినిమాలతో పాటు వచ్చే మిగతా సినిమాలు కూడా హిట్ అవ్వాలనే కోరుకుంటానని తెలిపాడు.

చివరగా ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి చెబుతూ నిర్మాత దిల్ రాజుతో సినిమా చేయాల్సి ఉందని, అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మాత్రం ముందే అనౌన్స్ చేశామని తేల్చేశాడు.ఈ సినిమా జానర్ గురించి చెప్పలేనని కానీ, ఎన్టీఆర్‌ను కామెడీ రోల్ లో చూసేందుకు ఆడియన్స్ ఎప్పటి నుండో వేయిట్ చేస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా మరోసారి నవ్వుల వర్షం కురిపిస్తానని హింట్ ఇచ్చేశాడు ఈ సక్సెస్ ఫుల్ ఫిలిమ్ మేకర్ !

ALSO READ:ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

Tags

Related News

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

చిన్నారి పాటకు ఫిదా అయినా మహేష్ .. ఒక్క కామెంట్ తో మిలియన్ వ్యూస్!

ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!

అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!

శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!

Big Stories

Advertisement
×