Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా సినిమాలు బిజినెస్ అంటూ నిత్యం ఎంతో బిజీగా గడిపే ఈయన సోషల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఏదైనా సినిమా విడుదలైనప్పుడు సినిమాలు నచ్చితే ఈయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, తన ఫ్యామిలీ వెకేషన్ కి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక మహేష్ బాబు(Mahesh Babu) తన అభిమానుల విషయంలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.
తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక చిన్నారి మహేష్ బాబు పాటలను పాడుతూ చేసిన ఒక రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో మహేష్ బాబు కంటికి కనిపించడంతో ఈయన చిన్నారి టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేర్ చేస్తుంది మహేష్ బాబు చేసిన ఈ ఒక్క కామెంట్ చిన్నారికి కోట్లలో వ్యూస్ రావడమే కాకుండా లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇటీవల ‘bysweetlycurious’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోలో భాగంగా చిన్నారి మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని “నొప్పి నొప్పి గుండెంత నొప్పి” పాట పాడింది. అనంతరం తన తల్లితో కలిసి గుంటూరు కారం సినిమాలోని “ధూమ్ మసాలా” అనే పాటను చాలా క్యూట్‌గా పాడింది. ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చిన్నారి మహేష్ బాబు సినిమాలో పాటలు పాడటంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ క్యూట్ వీడియో మహేష్ బాబు దృష్టిలో పడటంతో ఆయన కూడా ఈ వీడియో చూసి వీడియో పట్ల కామెంట్ చేశారు.
?lqvp=bW14amY4bW1jNTQy
ఇలా చిన్నారి క్యూట్ పాటలపై మహేష్ బాబు స్పందిస్తూ.. ‘హా హా.. సో క్యూట్.. లాట్స్ ఆఫ్ లవ్ టు ది లిటిల్ వన్’ అంటూ కామెంట్ చేశారు. మహేష్ బాబు చేసిన ఈ కామెంట్ కారణంగా ఈ వీడియోకి భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో 2.7 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అదే విధంగా ఈ చిన్నారికి ఇంస్టాగ్రామ్ లో భారీ స్థాయిలో ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఇదివరకు 35,000 మంది ఫాలోవర్స్ ఉండగా మహేష్ బాబు కామెంట్ తరువాత 1.51 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు . ఇలా మహేష్ బాబు ఒక్క కామెంట్ తో చిన్నారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
Also Read: శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!