E-Paper
Advertisement

శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!

శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!
Advertisement

Allu Arha Birthday : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ(Allu Arha) ఇటీవల తన పదవ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. అర్హ పదవ పుట్టినరోజు కావడంతో అల్లు ఫ్యామిలీ(Allu Family) మొత్తం శ్రీలంక (sri lanka)వెకేషన్ వెళ్లి అక్కడ తమ చిన్నారి పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా జరిపారని తెలుస్తోంది. అల్లు అర్హ నవంబర్ 21వ తేదీ తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. తాజాగా ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

క్యాండిల్ లైట్ డిన్నర్..

ఇలా తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ తన కూతురితో కలిసి దిగిన ఒక క్యూట్ సెల్ఫీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా జాయ్ ఆఫ్ మై లైఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తాజాగా శ్రీలంకలో అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ఫోటో వైరల్ అవుతుంది. ఓకే డైనింగ్ టేబుల్ పై అల్లు ఫ్యామిలీ అందరూ కూర్చొని డిన్నర్ చేస్తున్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అల్లు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో అల్లు అరవింద్ తన భార్య అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు అల్లు శిరీష్ ఫ్యామిలీ కూడా ఉన్నారు.

చూడముచ్చటగా అల్లు ఫ్యామిలి..

Advertisement

ఇలా అల్లు ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అల్లు అభిమానులు కూడా ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోపై విభిన్నంగా కామెంట్లు చేస్తున్నారు ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఇట్స్ ఫ్యామిలీ టైం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ తన సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి కావలసిన సమయాన్ని కేటాయిస్తూ నిత్యం తన భార్య పిల్లలతో వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతి ఏడాది తన కుమార్తె పుట్టినరోజు వేడుకను ఏదో ఒక దేశంలో నిర్వహిస్తూనే ఉంటారు.

శ్రీలంకలో పుట్టినరోజు..

ఇక తాజాగా తన కూతురు పదవ పుట్టినరోజు సందర్భంగా శ్రీలంక పర్యటనలో ఈ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వెల్లడించలేదు. దీంతో అల్లు అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా దీపికా పదుకొనే నటించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: భోగి ప్రమోషన్లకు దూరంగా అనుపమ… హైలెట్ అవుతున్న డింపుల్.. అదే కారణమా?

Related News

భోగి ప్రమోషన్లకు దూరంగా అనుపమ… హైలెట్ అవుతున్న డింపుల్.. అదే కారణమా?

కుర్రాళ్ల ఫేవరెట్ ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ఎప్పుడంటే?

రూ.2,000 కోట్ల క్లబ్‌పై రామాయణ కన్ను.. సాధ్యమేనా?

నర్సన్నా.. నన్ను కూడా సీఎం చేస్తావా? శర్వానంద్ కామెంట్స్ వైరల్!

శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!

సొగసుల సుందరి కాజల్.. 40ల్లో కూడా హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తూ!

కాక వెనక్కి.. విశ్వంభర ముందుకు.. సంక్రాంతికి చిరు సర్‌ప్రైజ్!

Big Stories

Advertisement
×