E-Paper
Advertisement

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!
Advertisement

Ramayana In Oscar Race: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం రామాయణ (Ramayana). రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ఇటీవల దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ 5వ తేదీ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 20 రోజులు అవుతున్న ఇప్పటికీ ఏమాత్రం కలెక్షన్లు తగ్గలేదని చెప్పాలి. అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన రామాయణ రెండువేల కోట్ల దిశగా అడుగులు వేస్తోంది.

2000 కోట్ల కలెక్షన్ల దిశగా రామాయణ..

ఈ విధంగా మైథాలజికల్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకున్న రామాయణ సినిమా ఆస్కార్ బరి(Oscar Race)లో నిలవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజువల్ వండర్ 99వ అకాడమీ అవార్డుల విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇలా ఈ సినిమా ఆస్కార్ బరిలో చోటు దక్కించుకోవడంతో అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా 1500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి 2000 కోట్లపై కన్ను వేసి అదే దిశగా పరుగులు వేస్తోంది. మరి రామాయణ 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టేనా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్..

Advertisement

ఇకపోతే రామాయణ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మొదటి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదలైంది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)రాముడి పాత్రలో కనిపించగా , సీత పాత్రలో సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. ఇక రావణాసురుడి పాత్రలో నటుడు యశ్ నటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా భారీ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

8 ఆస్కార్ అవార్డులు..

ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మించిన సంగతి తెలిసిందే. నమిత్ మల్హోత్రాకు చెందిన డీఎన్ఈజీ సమస్త రామాయణ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. అయితే ఇప్పటివరకు ఈ సమస్త ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను అందుకోవటం విశేషం. అయితే తాజాగా మరోసారి రామాయణ కూడా ఆస్కార్ రేసులో ఉన్న నేపథ్యంలో భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఆస్కార్ రేసులో భాగంగా ఈ సినిమా అవార్డు అందుకొనేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నమిత్ మల్హోత్రాతో పాటు నటుడు యష్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా రెండు భాగాలు సుమారు 4000 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Advertisement

Also Read: చిన్నారి పాటకు ఫిదా అయినా మహేష్ .. ఒక్క కామెంట్ తో మిలియన్ వ్యూస్!

Related News

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

చిన్నారి పాటకు ఫిదా అయినా మహేష్ .. ఒక్క కామెంట్ తో మిలియన్ వ్యూస్!

ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!

అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!

శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!

Big Stories

Advertisement
×