Mahesh Babu:గల్లా – ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో తనయుడు సిద్ధార్థ్ గల్లా ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొన్ని రోజుల క్రితం తాను ప్రేమించిన సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత పసుపు కార్యక్రమం చాలా ఘనంగా సాగింది. అంతేకాదు గల్లా – ఘట్టమనేని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరిగాయి. పైగా సిద్ధార్థ్ – హైన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అటు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ , ఆయన సోదరి మంజుల ఘట్టమనేని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఎట్టకేలకు సిద్ధార్థ్ – హైన్ పెళ్లి జరిగింది. నవంబర్ 25న వీరి వివాహం విదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి ఘట్టమనేని – గల్లా కుటుంబ సభ్యులతో పాటు వధువు తరఫు బంధువులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన క్షణాలను మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. కొత్తజంట చూడముచ్చటగా ఉంది అంటూ నెటిజన్స్ , సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు నూతన దంపతులకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఒకవైపు సోషల్ మీడియాలో సిద్ధార్థ్ – హైన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతుండగా మరొకవైపు కొత్త చర్చ మొదలయ్యింది. మేనల్లుడు పెళ్లి విదేశాలలో జరుగుతుంటే అసలు మహేష్ బాబు ఎక్కడ? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెళ్తే ..మహేష్ బాబు ప్రస్తుతం తన సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉండడం వల్లే మేనల్లుడి పెళ్లికి వెళ్లలేకపోయారేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చేవరకు అసలు విషయం తెలియదని చెప్పాలి. మొత్తానికైతే మంజుల షేర్ చేసిన ఈ ఫోటోలలో మాత్రం మహేష్ బాబు, ఆయన ఫ్యామిలీ కనిపించలేదు.
ALSO READ: ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!
మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఇండియానా జోన్స్ తరహాలో సాగే గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్ వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టే ఒక సాహస వీరుడు పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. విజయేంద్ర ప్రసాద్ అలియాస్ రాజమౌళి తండ్రి కథను అందించారు.