E-Paper
Advertisement

అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!

అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!
Advertisement

Alias Rukmini:వరుస ప్లాపులతో సతమతమైపోతున్న నితిన్ ఈ సారి తనకు బాగా అచ్చొచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌తో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపొయాడు. అలియాస్ రుక్మిణీ’ ఈసారి సరికొత్త కథతో పాటుఎమోషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతుండటంతో ఇటు ఇండస్ట్రీలో,అటు ఆడియెన్స్‌లో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక సినిమాని డిసెంబర్4న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లలో వేగం పెంచింది మూవీ టీమ్. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్

Advertisement

మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్కి జోడీగా కొత్త హీరోయిన్ ఆఫీయ సయ్యద్ నటిస్తోందన్న సంగతి తెల్సిందే. అయితే కేవలం రొమాంటిక్ కామెడీ మాత్రమే కాకుండా, గుండెను టచ్ చేసే ఎమోషన్స్ ఇందులో ఉన్నాయని వచ్చిన అప్ డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది.ఇక లవ్ స్టోరీలలో ఉండే ఫన్, ప్రేమలో ఎదురయ్యే కష్టాలు, బంధాల మధ్య ఉండే అనుబంధాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం .

ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 26న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో రేపు సాయంత్రం 3 గంటలకు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తుంది. ఇక ఈ ఈవెంట్ కి యూనిట్‌తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా అటెండ్ అవబోతున్నారని తెలుస్తుంది.మొత్తంగా ట్రైలర్ వస్తేనే సినిమా అసలు కథ ఏంటి, నితిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది, అనే విషయాలపై ఒక క్లారిటీ రానుందన్న మాట.

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే ..యునానిమస్ ప్రొడక్షన్స్ పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమాని న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ చేస్తుండటం విశేషం. ఇక దండోరా సినిమా తో తనేంటో ప్రూవ్ చేసుకున్నమురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

నితిన్ కెరీర్ లో ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీలు కొత్తేమీ కాదని తెల్సిందే . గతంలో ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ‘భీష్మ’వంటి సినిమాలు ఈ జానర్ లో వచ్చినవే.అయితే తమ్ముడు, చెక్, రాబిన్ హుడ్, మాచర్ల నియోజక వర్గం,రంగ్ దే ,మ్యాస్ట్రో అంటూ గత కొంతకాలంగా చేసిన సినిమా చేసినట్టే పోవడంతో ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. నితిన్ .చూడాలి మరి తనని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని నమ్ముతున్న ఆలియాస్ రుక్మిణి నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !

also read :ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మరోసారి అదరగొట్టేశాడుగా!

Tags

Related News

శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!

భోగి ప్రమోషన్లకు దూరంగా అనుపమ… హైలెట్ అవుతున్న డింపుల్.. అదే కారణమా?

కుర్రాళ్ల ఫేవరెట్ ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ఎప్పుడంటే?

రూ.2,000 కోట్ల క్లబ్‌పై రామాయణ కన్ను.. సాధ్యమేనా?

నర్సన్నా.. నన్ను కూడా సీఎం చేస్తావా? శర్వానంద్ కామెంట్స్ వైరల్!

శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!

సొగసుల సుందరి కాజల్.. 40ల్లో కూడా హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తూ!

Big Stories

Advertisement
×