E-Paper
Advertisement

ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!

ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!
Advertisement

Satvika veeravalli: సరైన పాత్ర పడాలే కానీ తమ నటనతో తమను తాము ప్రూవ్ చేసుకుంటూ అభిమానుల ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) కూడా ఒకరు. ‘ఆకాశంలో ఒక తార’ అంటూ తారాజువ్వలా నింగి నుండీ భువికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ చిత్రంతో తొలిసారి సినీ ప్రేక్షకులను పలకరించి.. తెరపై కనిపించి.. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది సాత్విక వీరవల్లి. నిజానికి ఆకాశంలో ఒక తార సినిమా కథ రాసుకున్నప్పుడే ఈ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట.. కానీ అనూహ్యంగా సాత్విక వీరవల్లిని ఎంపిక చేయడం జరిగింది. అయితే అందరి అంచనాలను నిజం చేస్తూ ఏకంగా ఈ సినిమాతో ఊహించని క్రేజ్ దక్కించుకుంది సాత్విక వీరవల్లి.

ఆకాశంలో ఒక తార సక్సెస్.. ఆడియన్స్ కి సాత్విక సర్ప్రైజ్..

ఇకపోతే మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ లభించడంతో ఎక్కడ చూసినా సాత్విక వీరవల్లి పేరు మారుమ్రోగిపోతుంది. తనను ఇంతగా ఆదరించిన అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ.. హైదరాబాదులోని ఏఎంబి థియేటర్ కు వెళ్లి దర్శనమిచ్చింది సాత్విక వీరవల్లి. తెరవెనుక రహస్యంగా సినిమా చూసి.. అభిమానుల కోలాహాలాలకు కన్నీటి పర్యంతం అయింది. సినిమా పూర్తవగానే ఆడియన్స్ ముందుకు వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక వారితో మాట్లాడుతూ..” నా మొదటి సినిమా ఆకాశంలో ఒక తార. ఆకాశమంత విజయం అందించినందుకు.. మీకు కృతజ్ఞతలు” అంటూ ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు పెట్టుకుంది.

కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక..

Advertisement

మొదటి సినిమాతోనే సాత్వికకు లభిస్తున్న క్రేజ్ ను చూసి ఏం క్రేజ్ గురూ అంటూ ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సాత్విక వీరవల్లికి ఆకాశంలో ఒక తార మంచి విజయాన్ని అందించడమే కాకుండా తన భవిష్యత్తుకు ఈ సినిమా తొలిమెట్టుగా నిలిచిందని చెప్పవచ్చు.

మీ పిల్లలతో కలిసి సినిమా చూడండి- చిరంజీవి

ఇదిలా ఉండగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసలు కురిపించారు. ఆయన సినిమా చూసిన తర్వాత తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పంచుకున్నారు. ” ఆకాశంలో ఒక తార సినిమా చూశాను.నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఎంతో స్ఫూర్తిదాయకమైన కథను.. ఎంతో నమ్మకంతో అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ పవన్ సాధినేనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. దుల్కర్ , సాత్విక వీరవల్లి తమ సహజనటనతో పాత్రకు జీవం పోసారు. శృతిహాసన్, రుహాని శర్మ మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దయచేసి తల్లిదండ్రులందరూ ఈ చిత్రాన్ని మీ పిల్లలతో కలిసి చూడండి. ఈ కథ వారిని ఎంతగానో ప్రేరేపిస్తుందని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. నిర్మాణ సంస్థలైన స్వప్న సినిమాస్ , గీత ఆర్ట్స్ , లైట్ బాక్స్ మీడియాకి అలాగే చిత్ర బృందం అంతటికీ నా హృదయపూర్వక అభినందనలు” అంటూ చిరంజీవి ఒక పోస్ట్ విడుదల చేశారు.

Advertisement

ALSO READ: బిగ్ బాస్10 విన్నర్ అతడే.. రోహిత్ వెళ్ళిపోయాక షో చూడడం మానేశారు: కౌశల్

నాని, రాజమౌళి కూడా..

మొత్తానికైతే మెగాస్టార్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు అంటే ఇక ఈ సినిమా కథాంశం ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చిరంజీవితో పాటు నాని , దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం జరిగింది.

Related News

అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!

శ్రీలంకలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఓకే ఫ్రేమ్ లో అల్లు ఫ్యామిలీ.. ఫోటో వైరల్!

భోగి ప్రమోషన్లకు దూరంగా అనుపమ… హైలెట్ అవుతున్న డింపుల్.. అదే కారణమా?

కుర్రాళ్ల ఫేవరెట్ ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ఎప్పుడంటే?

రూ.2,000 కోట్ల క్లబ్‌పై రామాయణ కన్ను.. సాధ్యమేనా?

నర్సన్నా.. నన్ను కూడా సీఎం చేస్తావా? శర్వానంద్ కామెంట్స్ వైరల్!

శోభిత షేర్ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా.. క్యాప్షన్ కూడా అంతే స్పెషల్!

Big Stories

Advertisement
×