Anil Ravipudi: పటాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆల్మోస్ట్ కళ్యాణ్ రామ్ మార్కెట్ పడిపోయింది అనుకునే టైంలో, ఈ సినిమా మంచి ప్లస్ పాయింట్ గా మారింది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. కేవలం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ను కూడా ప్రొడ్యూస్ చేశాడని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత దిల్ రాజు కాంపౌండ్ లో సుప్రీమ్ అనే సినిమా చేశాడు. సాయి తేజ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక్కడితో దిల్ రాజుకి మరియు అనిల్ రావిపూడి కి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పటికీ కూడా ఆ బాండింగ్ కొనసాగుతూ ఉంది. ఈ బ్యానర్లో అనిల్ రావిపూడి చేసిన లాస్ట్ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకి కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి.
సోషల్ ఎలిమెంట్ తో సినిమా
మామూలుగా అనిల్ రావిపూడి సినిమా అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది వినోదం. కేవలం కామెడీ సినిమాలు మాత్రమే తీస్తాడు అని అనిపించుకున్నాడు. అయితే కామెడీ సినిమాలతో పాటు ఆ సినిమాల్లోనే ఏదో ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. మొదటి సినిమా నుంచి అదే చేస్తున్నాడు. కాకపోతే కామెడీ ఎక్కువగా వైరల్ అయింది కాబట్టి ఒక కామెడీ దర్శకుడుగా పరిమితం చేసేసాడు. అటువంటి తరుణంలో బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమాను చేశాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి నేషనల్ అవార్డు లభించింది. దీనిపై అనిల్ రావిపూడి స్పందించారు.
అనిల్ మాటల్లో
నా కెరియర్ లో ఎన్నో వినోదాత్మక సినిమాలు చేశాను. ఎంటర్టైన్మెంట్ కీలకం అని అనుకున్నాను. అలానే కమర్షియల్ ఫిలిమ్స్ చాలా చేశాను. వాటన్నిటిని దాటి సోషల్ ఎలిమెంట్ తో తీసిన సినిమా భగవంత్ కేసరి. నా కెరీర్ లోనే భగవంత్ కేసరి ఓ విభిన్నమైన సినిమా
నా కంఫర్ట్ జోన్ దాటి ఈ సినిమా చేశాను. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి సున్నితమైన అంశాన్ని బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో తీసి సక్సెస్ అయ్యాం. సినిమా కోసం కష్టపడిన టీమ్ మెంబర్స్, నిర్మాతకు ధన్యవాదాలు. బాలకృష్ణ గారు ప్రస్తుతం ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. హైదరాబాద్ రాగానే చిత్ర యూనిట్ అంతా కలిసి తనకి అభినందనలు తెలియజేస్తాము అని అనిల్ రావిపూడి తెలియజేశారు.
Also Read: Kingdom Next Part : కింగ్‌డం కొత్త స్టోరీ… మెయిన్ హీరో సత్యదేవ్… విజయ్‌ది గెస్ట్ రోల్