OTT Movie : ఒక ఇండోనేషియన్ సినిమా రక్తపుటేరులను పారించింది. ఈ సినిమాలో ఉన్న హింస కారణంగా నలభైకి పైగా దేశాలలో దీనిని బ్యాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇండోనేషియన్ స్లాషర్ జానర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అత్యంత హింస, రక్తపాతం ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. డిన్నర్ కి పిలిచి హత్యలు చేసే ఒక నరమాంస భక్షకుల కుటుంబం చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘మకాబ్రే’ (Macabre) ఒక ఇండోనేషియన్ హారర్ స్లాషర్ చిత్రం. దీనికి మో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షరీఫా డానిష్, జూలీ ఎస్టెల్ , ఆరియో బాయు, సిగి విమల, ఇమెల్డా థెరిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2007లో విడుదలైన ‘దారా’ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా రూపొందింది. ఇది 1970-80 లలో వచ్చిన స్లాషర్ చిత్రాలైన ‘టెక్సాస్ చైన్సా మాసకర్’, ‘ఫ్రైడే ది 13th’ లాంటి క్లాసిక్ హారర్ చిత్రాలకు నీరాజనం వంటిది. ఈ చిత్రం 2009 జులైలో బుచియాన్ ఇంటర్నేషనల్ ఫాంటస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. IMDbలో ఈ సినిమాకి 6.4/10 రేటింగ్ ఉంది. ఈ చిత్రం తీవ్రమైన రక్తపాతం, షరీఫా డానిష్ నటనకు ప్రశంసలు అందుకుంది. MUBI, Binged లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
అడ్జీ, ఆస్ట్రిడ్ ఒక కొత్తగా పెళ్లైన జంట. ఆస్ట్రేలియాలో కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు బాండుంగ్ నుంచి జకార్తా విమానాశ్రయానికి రోడ్ ట్రిప్‌లో బయలుదేరుతారు. ఆస్ట్రిడ్ ఇప్పుడు ఎనిమిది నెలల గర్భవతిగా ఉంటుంది. అడ్జీ తన చెల్లెలు లాడియాతో ఉన్న మనస్పర్థలను సరిదిద్దాలని అనుకుంటాడు. ఆమె తమ తల్లిదండ్రుల మరణానికి అడ్జీని నిందిస్తూ దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రిప్ లో ఈ జంటతో పాటు వారి స్నేహితులు ఆలం, ఏకో, జిమ్మీ కూడా ఈ ట్రిప్‌లో ఉంటారు. లాడియాను పికప్ చేసుకున్న తర్వాత, వారు రోడ్డు మీద ఒక మాయా అనే అమ్మాయిని చూస్తారు. ఆమె గందరగోళంగా తాను కిడ్నాప్ కిడ్నప్ అయ్యానని చెప్పి, ఇంటికి లిఫ్ట్ అడుగుతుంది. ఆపిల్ల మీద జాలిపడి, ఆమెను ఆ అడవుల్లో ఒంటరిగా ఉండే ఇంటికి తీసుకెళతారు. మాయా వీళ్ళను తన తల్లి దారాకు పరిచయం చేస్తుంది. ఆమె వాళ్ళు చేసిన హెల్ప్ కి కృతజ్ఞతగా డిన్నర్‌కు ఆహ్వానిస్తుంది. అయితే ఈ డిన్నర్ ఒక ఉచ్చులో భాగం అవుతుంది.
వీళ్ళు తినే ఆహారంలో మత్తుమందు కలిపి, ఆ ఆరుగురు స్నేహితులను బంధిస్తుంది. ఇక వీళ్ళు ఆమత్తు నుంచి మెళుకువలోకి వచ్చినప్పుడు, తామంతా బంధించబడ్డామని తెలుసుకుంటారు. ఈ కుటుంబం ఒక కన్నిబాలిస్టిక్ కల్ట్. అంటే మనుషుల మాంసం తినడం ద్వారా దీర్ఘాయుష్షు పొందేందుకు ప్రయాణికులను హతమార్చే ఒక దుష్ట ఆచారాన్ని పాటిస్తుంటుంది. ఇక్కడ నుంచి సినిమా ఒక రక్తపాత గోర్‌ఫెస్ట్‌గా మారుతుంది. దారా ఆమె కుటుంబం సిస్టమాటిక్‌గా ఈ స్నేహితులను ఒక్కొక్కరిని చంపడం మొదలుపెడతారు. దారా కదలికలు ఆమెను ఒక సైకోటిక్ విలన్‌గా చుపిస్తాయి. ఆమె సోదరులు ఆడమ్, అర్మాన్ కూడా అంతే సాడిస్టిక్‌గా ఉంటారు.
Read Also : ఇదేం మాయ రోగంరా అయ్యా… అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు వైరల్… పిచ్చెక్కించే మలయాళ సైకో థ్రిల్లర్
ఈ సినిమా మొదటి 30 నిమిషాలు సరదాగా గడుస్తుంది. ఆ తర్వాత రక్తంతో ఒక నాన్-స్టాప్ హారర్ రైడ్ మొదలవుతుంది. ఈ క్రమంలో లాడియా తన ధైర్యసాహసాలతో, ఈ కన్నిబాల్ కుటుంబాన్ని ఎదిరించడానికి పోరాడుతుంది. ఆమె పాత్ర సినిమాకు ఒక బలమైన ఫీమేల్ లీడ్‌ను అందిస్తుంది. సినిమా మధ్యలో, కొంతమంది పోలీసులు కూడా ఈ ఇంటికి వస్తారు. కానీ వాళ్ళు కూడా ఈ కుటుంబం చేతిలో దారుణంగా చనిపోతారు. సినిమా క్లైమాక్స్‌లో ఒక చిన్న సూపర్‌నాచురల్ ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఆ సైకోల చేతిలో వీళ్లంతా చనిపోతారా ? ప్రాణాలతో బయటపడతారా ? లాడియా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.