Kingdom Next Part : ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్ కి నిన్న కింగ్డమ్ రూపంలో తెరపడింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి విపరీతమైన బుకింగ్స్ వచ్చాయి. కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు రికార్డ్స్ కొల్లగొడతాడు క్లారిటీ అందరికీ వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ కి సగం డబ్బులు మొదటి రోజే వచ్చేసాయి. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగ వంశీ తెలిపాడు.
ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి చూసిన అంతమంది యునానిమస్ గా సూపర్ హిట్ అని అనలేదు. కొంతమంది బాగుంది అన్నారు. కొంతమంది అంత ఏముంది అన్నారు. ఇంకొంతమంది అదిరిపోయింది అన్నారు. కానీ అందరికీ ఉన్న ఏకైక కంప్లైంట్ సినిమా సెకండాఫ్. సెకండాఫ్ లో ఒక చోట సినిమా స్లోగా నడుస్తుంది.
సత్యదేవ్ మెయిన్ హీరో
కింగ్డమ్ మూవీలో సత్యదేవ్ హీరో అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై నాగ వంశీ కూడా మాట్లాడాడు. అయితే అది నిజం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మూవీలో సూరిగా విజయ్, శివగా సత్యదేవ్ నటించారు. ఇక్కడ సత్యదేవ్ పాత్ర… వాళ్ల నాన్నని తమ్ముడి చంపితే… తనపై వేసుకుని దూరంగా వెళ్లిపోతాడు. ఏదో చిన్న పడవతో… శ్రీలంకకు లోని ఆ తెగ ఉన్న చోటుకి చేరుతాడు.
అక్కడ వాళ్లందరికీ లీడర్ అవుతాడు. అక్కడ పుట్టిన వాళ్లకు కూడా సత్యదేవ్ పాత్రే లీడర్. ఎక్కడో తెలంగాణలోని ఒక ఊరిలో పుట్టి… శ్రీలంకకు వచ్చి ఆ తెగ లీడర్ గా, స్మగ్లింగ్ చేస్తూ… ఆ తెగ మొత్తానికి అండగా ఉండే సత్యదేవ్ పాత్ర పైన మెయిన్ తీసుకుని కథ రాసుకుని ఓ సినిమా చేయొచ్చు.
అదే అసంతృప్తి
తన అన్న మీద ఉన్న ప్రేమతో శివ పాత్రను ఎలా అయినా కూడా తన ఇంటికి తీసుకెళ్లి పోవాలి అనే స్వార్థం విజయ్ కి ఉండడం తప్పులేదు. అలానే శివను నమ్ముకుని ఎంతమంది ఉన్నారు అని సూరి పాత్రకు కూడా ఒక రియలైజేషన్ ఉండాలి. సినిమా చూస్తున్న తరుణంలో కొన్ని సందర్భాలలో సత్యదేవ్ మాత్రమే హీరోలా అనిపిస్తాడు. పేరుకు తమ్ముడు పాత్ర చేసినా కూడా తమ్ముడులానే మిగిలిపోయాడు విజయ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం అన్నా అనే స్వార్థం కోసమే విజయ్ అక్కడ ఉంటాడు అని ఎక్కువగా కనిపించింది. కొన్ని సీన్స్ లో విజయ్ అందరికంటే బాగా ఆలోచిస్తాడు. ఇప్పుడు దివి దాటని ఆడవాళ్ళని దివి దాటేలా చేస్తాడు. ఇదంతా ఓకే కానీ అంతగా ఆడియన్ కి అది రిజిస్టర్ కాలేదు. ఏదేమైనా సత్యదేవ్ మాత్రం డామినేట్ చేశాడు అనేది వాస్తవం. సత్యదేవ్ కొన్ని సన్నివేశాల్లో హీరోలా అనిపిస్తాడు. ముఖ్యంగా సత్యదేవ్ చనిపోయే ముందు చేసిన దివి ప్రజలను బ్రతికించడానికి చేసే ప్రయత్నం.
Also Read: Arabia Kadali : క్రిష్ జాగర్లమూడి వెర్షన్ లో తండేల్ సినిమా, దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో.?