Anjana Arjun:యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కూతురు అంజనా అర్జున్ దాదాపు 14 ఏళ్ల ప్రేమాయణం తర్వాత ఎట్టకేలకి తన ప్రియుడు ఇసాయ్ నట్టర్ తో పెళ్లి పీటలు ఎక్కేసింది.దీంతో ఇపుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అంజనా గురించే జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయ్.ఈ క్రమంలోనే అక్కలాగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండా అసలు అంజనా ఏం చేస్తుందా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు.
అమెరికాలో చదువుతున్నప్పుడే
మాములుగా డాక్టర్ పిల్లలు డాక్టర్స్ అయినట్టు,లాయర్ పిల్లలు లాయర్స్ అయినట్టు హీరో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య సర్జా ఇండస్ట్రీలో తన లక్ ని టెస్ట్ చేసుకున్నప్పటికీ చిన్న కూతురు మాత్రం ఇండస్ట్రీ బాట పట్టకపోవడం గమనార్హం.తాను అమెరికాలో చదువుతున్నప్పుడే ఒక స్టార్టప్ పెట్టాలన్న ఆలోచన వచ్చిందట.అలా బిజినెస్ లో తనకంటూ ఒక ప్రతేకత ఉండాలని సర్జా వరల్డ్ అనే పేరుతో ఒక బ్రాండ్ లాంచ్ చేసి దానికి CEOగా బాధ్యతలు నిర్వహిస్తుంది అంజనా.
రెగ్యులర్ గా తయారు చేసే హ్యాండ్ బ్యాగులు కాకుండా
ఇక అందులో పర్యావరణానికి హాని చేసే వస్తువులు కాకుండా ,మేలు చేసే వస్తువుల తయారీపై ఫోకస్ పెట్టడం ఇక్కడ విశేషం.అందులో భాగంగానే రెగ్యులర్ గా తయారు చేసే హ్యాండ్ బ్యాగులు కాకుండా పండ్ల తొక్కలతో హ్యాండ్ బ్యాగులు తయారు చేస్తూ పర్యావరణ రక్షణకి తనవంతు బాధ్యతని నిర్వహిస్తుంది.మాముకుగా మనకి హ్యాండ్ బ్యాగులు అంటేనే లెదర్ లేదా సింథటిక్ బ్యాగులు గుర్తుకువస్తాయి.కాని అందరికన్నాభిన్నంగా పళ్ళ నుండి తీసి పారేసే తొక్కల్ని ఇలా హ్యాండ్ బ్యాగుల తయారీలో వాడవచ్చు అన్న ఆలోచన చేసిన అంజనా అర్జున్ ని మెచ్చుకుని తీరాలి.
తమిళి సై రంగరాజన్ కూడా
అంతే కాదండోయ్..ఈ హ్యాండ్ బ్యాగులని తయారు చేసే యూనిట్ ఒకదానికి మన హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేసింది అంజనా.ఇక దేనికి అప్పట్లో తెలంగాణా గవర్నర్ గా పని చేసిన తమిళి సై రంగరాజన్ కూడా ఈ యూనిట్ ప్రారంభోత్సవానికి చీప్ గెస్ట్ గా వచ్చి అంజనా అర్జున్ కి తన శుభాకాంక్షలని తెలియజేసింది కూడా.
నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే !
ఇక కేవలం ఈ ఒక్క హ్యాండ్ బ్యాగుల తయారీనే కాకుండా ఇంకా పర్యావరణానికి మేలు చేసే మరిన్ని ఫ్యాషన్ థింగ్స్ ని కూడా తన సర్జా వరల్డ్ లో లాంచ్ చేసేస్తుంది అంజనా.ఇక అంజనా పెళ్లి చేసుకున్న ఇసాయ్ నట్టర్ కూడా అమెరికాలో ఇప్పుడిప్పుడే స్టార్టప్ పెట్టి పారిశ్రామికంగా ఎదుగుతున్నాడని తెలుస్తుంది .ఏది ఏమైనా తండ్రి లాగా ఈజీగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వకుండా తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకుంటున్నా అంజనా ప్రయత్నాన్ని నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే !