E-Paper
Advertisement

తెలుగు వాళ్లకు అవకాశాలు కరువయ్యాయా.. నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ దక్షి !

తెలుగు వాళ్లకు అవకాశాలు కరువయ్యాయా.. నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ దక్షి !
Advertisement

Bigg Boss Dakshi guttikonda: గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకించి తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ ఎంతో మంది హీరోయిన్స్ తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మిగతా భాష ఇండస్ట్రీల హీరోయిన్ల లాగా తెలుగు హీరోయిన్స్ గ్లామర్ షో చేయరు. దర్శక నిర్మాతల మాటలు వినరు ఈ కారణంగానే వారికి తెలుగులో అవకాశాలు రావట్లేదు అనే కామెంట్లు ఒకవైపు వినిపిస్తుంటే.. హీరోయిన్స్ మాత్రం గ్లామర్ షో చేయడానికి కూడా తాము సిద్ధమే అని నిరూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరు అంటూ కొంతమంది చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

తెలుగు వాళ్ళను పట్టించుకోవడం లేదా?

ఇప్పటికే వైష్ణవి చైతన్య , శివానీ నాగారం లాంటి హీరోయిన్లు మనలో టాలెంట్ ఉంటే కచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది అని నిరూపిస్తున్నారు కూడా.. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 10 లో వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి రెండు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రముఖ నటి దక్షి గుత్తికొండ (Dakshi guttikonda) తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. “కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కన్నడ వాళ్లను ఎంకరేజ్ చేస్తారు. తమిళ్ వాళ్లు తమిళ్ వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు. అలాగే హిందీ వాళ్ళు హిందీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు.. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రమే అన్ని భాషల వాళ్లకు అవకాశం కల్పిస్తారు కానీ తెలుగు వాళ్లను పట్టించుకోరు” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. ఇక ఇక్కడ మరో మైనస్ ఏమిటంటే ఇంట్లో వాళ్లు కూడా తెలుగు సినిమాలలో నటిస్తామంటే ఒప్పుకోరని, భయపడతారు అంటూ కూడా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

ఎవరీ దక్షి గుత్తికొండ?

Advertisement

ఇకపోతే హౌస్ లో రెండు వారాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈమె పలు ఇంటర్వ్యూల ద్వారా మళ్లీ వార్తల్లో నిలుస్తోంది .ఈ నేపథ్యంలోనే దక్షి బ్యాక్గ్రౌండ్ కూడా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్కా తెలుగు అమ్మాయి దక్షి. హైదరాబాద్, బెంగళూరులలో పెరిగింది. చిన్నప్పటి నుంచి కళా రంగంపై మక్కువ పెంచుకున్న ఈమె.. మంచి కూచిపూడి డాన్సర్ కూడా.. బెంగళూరులోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసింది.

also read: బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక షాలిని ఏం చేస్తోందో తెలుసా?

దక్షి మూవీ కెరియర్..

Advertisement

పలు కమర్షియల్ యాడ్స్, ప్రింట్ షూట్ లలో మెరిసిన ఈమె.. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో అగస్త్య మంజు తెరకెక్కించిన ‘కరోనా వైరస్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నితిన్ నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో కూడా హీరో మరదలి పాత్రలో కనిపించి మెప్పించింది. అలాగే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షో తో పాటు డిజిటల్ ప్రాజెక్టు లివింగ్ మై డ్రీమ్ తో కూడా ఆకట్టుకుంది.

Related News

మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!

ఇండస్ట్రీలో విషాదం.. ‘సీఐడీ’ డైరెక్టర్ బీ.పీ.సింగ్ మృతి!

‘గోట్స్’లోనే ఐక్యత లేదు.. మీరేం జడ్జెస్ అయ్యా సామీ!

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక షాలిని ఏం చేస్తోందో తెలుసా?

యాంకర్ తో పెళ్లిపై సుధీర్ క్లారిటీ!

‘సరిగమప’ కంటెస్టెంట్స్ కి అనిల్ రావిపూడి బంపర్ ఆఫర్!

బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోందా.. రోహిత్ మాటలకు గీతూ రియాక్షన్!

Big Stories

Advertisement
×