E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ?ఎక్కడంటే?

ఆదర్శ కుటుంబం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ?ఎక్కడంటే?
Advertisement

Aadarsha kutumbam AK 47:విక్టరీ వెంకటేష్ (Venkatesh)హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam AK 47) గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడింది. అలా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ జరగబోతోంది? అనే విషయాలపై చిత్ర బృందం అఫీషియల్ పోస్టర్ విడుదల చేసింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడంటే?

చిత్ర బృందం ఈ మేరకు విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్ విషయానికి వస్తే.. అక్టోబర్ 27న అనగా నేడు హైదరాబాదులోని హైటెక్ సిటీలో శిల్పకళా వేదికగా సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభం కానుంది. వెంకటేష్ , త్రివిక్రమ్ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీనిధి శెట్టి, వెంకటేష్ కూతురిగా నటిస్తున్న యువినా పార్థవితో పాటు నివేదా పేతురాజు, నారా రోహిత్ తదితరులు ఈవెంట్లో పాల్గొనబోతున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరంటే?

Advertisement

ఇకపోతే ఆదర్శ కుటుంబం మూవీకి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సినీవర్గాలలో బలమైన ప్రచారం సాగుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీలతో ప్రత్యేక అనుబంధం, అలాగే వెంకటేష్ గారి చిత్రమైన ‘చింతకాయల రవి’లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో చేసిన సాన్నిహిత్యం కారణంగానే ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగే వరకు ఎదురు చూడాల్సిందే.

also read:‘సరిగమప’ కంటెస్టెంట్స్ కి అనిల్ రావిపూడి బంపర్ ఆఫర్!

అక్టోబర్ 30న రాబోతున్న ఆదర్శ కుటుంబం..

Advertisement

ఆదర్శ కుటుంబం.. హౌస్ నెంబర్ 47 అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు .

సెన్సార్ పూర్తి. రన్ టైం లాక్..

ఇకపోతే ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. 2 గంటల 29 నిమిషాల నిడివితో రాబోతున్న ఈ యాక్షన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సినిమాపై సభ్యులు తమ రివ్యూ కూడా ఇచ్చేశారు. మొదటి భాగం చాలా బాగుందని, రెండవ భాగం కాస్త స్లోగా సాగినప్పటికీ వర్కౌట్ అయిందని మొత్తానికి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని సెన్సార్ సభ్యులు తమ రివ్యూ ఇచ్చేశారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

హీరోయిన్ గా దేవయాని కూతురు.. హీరో ఎవరంటే?

ఆర్. పి పట్నాయక్ మాటిచ్చి మోసం చేశారు..ఆ హిట్ సాంగ్స్ నావే: గరివిడి లక్ష్మి

ఆదర్శ కుటుంబం సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా టికెట్ ధరలు పెంపు!

విజయ్ రష్మిక పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్!

నజ్రియా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

అమ్మా నువ్వే చేయించుకో… సీతమ్మ పాత్ర చేయడం పై సాయి పల్లవి కామెంట్స్!

నాలోనే ఆ సమస్య ఉందనుకున్నాను – కీర్తి సురేష్

Big Stories

Advertisement
×