E-Paper
Advertisement

హీరోయిన్ గా దేవయాని కూతురు.. హీరో ఎవరంటే?

హీరోయిన్ గా దేవయాని కూతురు.. హీరో ఎవరంటే?
Advertisement

Actress Devayani:సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది వారసులు లేదా వారసురాళ్లు సులభంగా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తమ కుటుంబ సభ్యుల బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించుకొని మంచి మంచి కథలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే ఆగమనం సులభమే అయినా.. ఇండస్ట్రీలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలి అంటే మాత్రం గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, నిలదొక్కుకొని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు కొంతమంది అయితే.. మరి కొంత మంది తమ టాలెంటును నిరూపించుకోలేక ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు కూడా ఉన్నారు.

హీరోయిన్ గా దేవయాని కూతురు..

ఇలాంటి సమయంలో తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటానంటూ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రముఖ నటి దేవయాని (Devayani)కూతురు ప్రియాంక రంజన్ (Priyanka Ranjan). ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇదివరకే ‘ది అడ్వకేట్’ మూవీతో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తాజాగా తన రెండో చిత్రాన్ని ప్రకటించింది. ‘బ్లాక్ నైట్ బాయ్స్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ద్వారా సీరియల్ నటుడు అమల్ అజిత్ (Amal Ajith) హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి కేఈ మణికంఠన్ అలియాస్ విమల్ జి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సెంబర్ వి మురుగేషన్ దర్శకత్వం వహిస్తున్నారు.

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన షూటింగ్..

Advertisement

ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. వైవిద్య భరితమైన ప్రేమతో కూడిన జనరంజక కుటుంబ కథ చిత్రంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు కూడా పేర్కొన్నారు. మరి ఈ సినిమాతో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చూస్తున్న ఈ బ్యూటీకి స్టార్ స్టేటస్ లభిస్తుందో లేదో చూడాలి.

also read:బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోందా.. రోహిత్ మాటలకు గీతూ రియాక్షన్!

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీరియల్ నటుడు..

Advertisement

ఇకపోతే ఈ చిత్రం ద్వారా అమలు అజిత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమల్ అజిత్. 2008లో మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన అమల్ అజిత్ గురువాయూరప్పన్, అమ్మ, స్త్రీ పధం వంటి మలయాళ సీరియల్స్ లో నటించారు. అలాగే సన్ టీవీలో ప్రసారమైన సూపర్ హిట్ తమిళ్ సీరియల్ సింగపన్నే లో అన్భు అనే హీరో పాత్రలో నటించారు. ఈ సీరియల్ కంటే ముందు కలర్స్ తమిళ్ ఛానల్ లో వచ్చిన అమ్మన్ సీరియల్ లో డాక్టర్ ఈశ్వర్ పాత్ర ద్వారా మంచి ప్రజాదారణ సొంతం చేసుకున్నారు.

Related News

ఆర్. పి పట్నాయక్ మాటిచ్చి మోసం చేశారు..ఆ హిట్ సాంగ్స్ నావే: గరివిడి లక్ష్మి

ఆదర్శ కుటుంబం సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా టికెట్ ధరలు పెంపు!

విజయ్ రష్మిక పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్!

నజ్రియా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

అమ్మా నువ్వే చేయించుకో… సీతమ్మ పాత్ర చేయడం పై సాయి పల్లవి కామెంట్స్!

నాలోనే ఆ సమస్య ఉందనుకున్నాను – కీర్తి సురేష్

మా సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు.. విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×