Khammam: ప్రేమిస్తున్నానని నమ్మించి, తీరా పెళ్లి సమయానికి ముఖం చాటేసిన ఓ ప్రియుడి తీరుపై ఓ యువతి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం సూర్యతండాలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నాలుగేళ్ల బంధం.. చివరికి దగా!
సూర్యతండాకు చెందిన సబావట్ ప్రవీణ్ కుమార్, రాజేశ్వరి అనే యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో తనను శారీరకంగా లొంగదీసుకుని, తీరా ఇప్పుడు తనను కాదని వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని రాజేశ్వరి కన్నీటిపర్యంతమైంది. తన జీవితాన్ని నాశనం చేసి, ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం సూర్యతండాలో ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. నాలుగేళ్లుగా ప్రేమించి, శారీరకంగా వాడుకొని ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని సబావట్ ప్రవీణ్ కుమార్‌పై రాజేశ్వరి అనే యువతి ఆరోపించింది. తనకు… pic.twitter.com/vKQgkXtjPT
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2026
న్యాయం జరిగే వరకు కదిలేది లేదు!
తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోయిన బాధితురాలు.. నేరుగా ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది. ‘నన్ను మోసం చేసిన ప్రవీణ్ నన్నే పెళ్లి చేసుకోవాలి, నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు’ అని తెగేసి చెప్పింది. ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగడంతో సూర్యతండా పరిసర ప్రాంతాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు కూడా అక్కడకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వాతావరణం వేడెక్కింది.
Also Read: అర్నాబ్ తుపాన్ ఎఫెక్ట్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో 16 విమాన సర్వీసులు రద్దు!