Priya Bhavani Shankar Marriage:రీసెంట్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చెప్పక్కర్లేదు.కేవలం 35 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 270 కోట్ల వసూల్లని కొల్లగొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.ఇక ఈ సినిమాలో రవితేజ భార్య అయిన కావేరీ పాత్రలో నటించిన ప్రియా భవానీ శంకర్ మనందరినీ మెప్పించిన సంగతి తెల్సిందే.అయితే ఇపుడు ఆ అమ్మడు నిజ జీవితంలో పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్తలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
పదేళ్లుగా డేటింగ్ లో ఉన్న రాజ్ వెల్ రాజ్
అవును ..తన కాలేజీ రోజుల నుండి పరిచయం ఉన్న రాజ్ వెల్ రాజ్ ని పెళ్లాడబోతుందని,ఇక గత పదేళ్లుగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని,త్వరలో వీరు ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.ముఖ్యంగా ప్రియా ఇంస్టా స్టోరీస్ లో పెట్టిన ఫోటోలు ఫోటోలు చూస్తుంటే పెళ్లి పనులు మొదలయ్యాయా? అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి కూడా. దీంతో ప్రియా పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అంటూ అప్పుడే డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.
పెళ్లి తేదీ ఎప్పుడు? ఎక్కడ జరగబోతోంది?
ఇక ప్రియా ప్రేమకథ విషయానికి వస్తే.. ఆమెకు రాజ్‌వెల్ రాజ్‌తో కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉందని తెలుస్తుంది.సినిమా హీరోయిన్‌గా బిజీ అయిన తర్వాత కూడా తమ బంధాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన ఎట్టకేలకి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న మాట. మరోవైపు వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరగబోతోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భారీగా సినీ ప్రముఖులను పిలిచి గ్రాండ్‌గా వేడుక చేయడం కంటే.. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. అయితే పెళ్లి తేదీ ఎప్పుడు? ఎక్కడ జరగబోతోంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
సినిమాల విషయానికి వస్తే
ఇక ప్రియా భవానీ శంకర్ సినిమాల విషయానికి వస్తే.. మొదటగ బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా ‘మేయాద మాన్’ సినిమాతో తమిళ తంబీలని ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత ‘మాన్స్టర్’, ‘ఓ మనపెన్నే’, ‘యానై’, ‘తిరుచిత్రంబలం’, ‘పత్తు తల’, ‘రుద్రన్’, ‘డిమోంటే కాలనీ 2’ వంటి సినిమాలలో నటించి తనేంటో ప్రూవ్ చేసుకుంది.ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే ‘కల్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన ఈ తమిళ భామ ‘ఇరుముడి’ సినిమా తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.
మొత్తానికి కెరీర్ లో సూపర్ హిట్ కొట్టిన ఈ భామ ఇపుడు రియల్ లైఫ్ లో సరికొత్త అడుగులు వేయబోతుందన్న మాట. చూడాలి మరి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ పెళ్లి వార్తలపై ప్రియా భవాని శంకర్ ఎలా రియాక్ట్ అవుతుందో !
also read :అబ్బబ్బా.. ఏం పాటరా బాబు! ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్ రచ్చ!