E-Paper
Advertisement

AK47 Update: వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమాలో కనిపించబోతున్న మరో తెలుగు స్టార్ హీరో.. ఎవరంటే..?

AK47 Update: వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమాలో కనిపించబోతున్న మరో తెలుగు స్టార్ హీరో.. ఎవరంటే..?
Advertisement

AK47 Update: విక్టరీ హీరో వెంకటేష్ నటిస్తున్న.. కొత్త సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నటుడు నారా రోహిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహం తెచ్చింది.

ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం.. AK 47 అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంతేకాదు..త్రివిక్రమ్ ఈ చిత్రానికి..బంధు మిత్రుల అభినందనలతో అనే సంప్రదాయ తెలుగు శీర్షికను కూడా రిజిస్టర్ చేసినట్టు సమాచారం. పెళ్లి పత్రికల్లో తరచూ వినిపించే ఈ మాటలు, తెలుగు సంప్రదాయం, కుటుంబ విలువలను.. గుర్తు చేస్తాయి. అందుకే ఈ టైటిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Advertisement

వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఇదే తొలిసారి దర్శకుడు..హీరోగా కలిసి పని చేయడం. అయితే గతంలో త్రివిక్రమ్ రచయితగా నువ్వు నాకు నచ్చావ్.. వాసు.. మల్లీశ్వరి వంటి సినిమాలకు కథ అందించారు. ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకత్వంలో ఈ ఇద్దరి కలయిక ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారని సమాచారం. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. వెంకటేష్ ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో క్యామియో పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకటేష్ క్రేజ్ మరింత పెరిగింది. మరోవైపు త్రివిక్రమ్ గత చిత్రం గుంటూరు కారం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ ఇద్దరికీ చాలా కీలకం.

Advertisement

మొత్తం పైన..వెంకటేష్–త్రివిక్రమ్–నారా రోహిత్ కలయికతో రూపొందుతున్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమా విడుదలయ్యే వరకు ఈ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ALSO READ: Roger Allers Death: ది లయన్ కింగ్ సినిమా దర్శకుడు మృతి..!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×