ANR: ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే అభిమాన హీరోల పుట్టినరోజులు, పెళ్లిరోజులు, మరేదైనా స్పెషల్ అకేషన్ ఉన్న రోజు తప్పకుండా తమ అభిమాన హీరోల పాత సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తూ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆ సినిమాలను 4K లో రిలీజ్ చేసి నిర్మాతలు కూడా లాభపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) చిత్రం ‘ప్రేమాభిషేకం’ కూడా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. అయితే అభిమానులకు శుభవార్త ప్రకటించారు మేకర్స్. టికెట్ కొనకుండానే థియేటర్లలో ప్రేమాభిషేకం సినిమాను చూసేయొచ్చు అని తెలిపారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా.. శాశ్వత చిరునామాగా నిలిచారు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఆయనను ఇంకా సజీవంగానే ఉంచాయి అనడంలో సందేహం లేదు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా.. ఆయన సినీ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రాలలో డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం సినిమాలను ప్రత్యేకంగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ అభిమానులకు శుభవార్త ప్రకటించారు.
ఉచిత ప్రదర్శన.. ఎప్పుడు.. ఎక్కడంటే?
ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సంస్థ ప్రేమాభిషేకం మూవీ రీ రిలీజ్ ప్రోమోను రిలీజ్ చేస్తూ.. అక్కినేని నాగేశ్వరరావును తెరపై మళ్లీ బ్రతికించే ప్రయత్నంలో భాగంగా ప్రేమాభిషేకం మూవీ సెప్టెంబర్ 20వ తేదీన రీరిలీజ్ చేయబోతున్నాము.. రూపాయి ఖర్చు లేకుండా బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు”అంటూ ప్రకటించారు. ఇకపోతే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..సెప్టెంబర్ 20, 21 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ రెండు చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నారు.. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా ప్రకటించడంతో ఏఎన్ఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. మొత్తానికైతే సినీ ఇండస్ట్రీలో తొలిసారి రూపాయి కూడా ఆశించకుండా అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయనను అభిమానులు మరొకసారి గుర్తుచేసుకొని, ఆయన సినిమాలను ఎంజాయ్ చేయాలనే విధంగా అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
75 ఏళ్ల సినీ కెరియర్ లో వందల చిత్రాలు..
అక్కినేని విషయానికి వస్తే.. నట సామ్రాట్ గా పేరు సొంతం చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు.. కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించి, వెండితెరకు ప్రవేశించారు. అలా 75 ఏళ్ల సినీ కెరియర్ లో వందల చిత్రాలలో నటించిన ఆయన.. ఎంతోమందికి రోల్ మోడల్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా కూడా తెలుగు తెరపై ప్రత్యేకముద్ర వేసుకున్నారు. నటనతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా అమూల్యమైన సేవలను అందించిన ఈయన దేవదాస్, మాయాబజార్, ప్రేమ్ నగర్ ఇలా ఎన్నో క్లాసిక్ హిట్ సినిమాలను తెరకెక్కించి మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ALSO READ:Bandla Ganesh: బన్నీవాసు దెబ్బకు దిగొచ్చిన బండ్లన్న… ఆయన దేవుడు అంటూ ట్వీట్
దాదాసాహెబ్ ఫాల్కే తో పాటు పద్మ భూషణ్ పురస్కారం కూడా..
ఇకపోతే 2014లో అక్కినేని కుటుంబ చిత్రంగా వచ్చిన మనం సినిమాలో ఆయన చివరిగా నటించారు. ఇక పేగు క్యాన్సర్ బారినపడి 2014 జనవరి 22న 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు అక్కినేని నాగేశ్వరరావు. తన సినీ కెరియర్ లో ఎన్నో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న ఈయన 1990లో దేశ అత్యున్నత పౌర పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. అలాగే పద్మభూషణ్ పురస్కారం కూడా కేంద్ర ప్రభుత్వం అందజేసింది.
?utm_source=ig_web_copy_link