Bandla Ganesh: బండ్ల గణేష్ (Bandla Ganesh) .. నిర్మాతగా, నటుడిగా, హీరోగా, కమెడియన్ గా కూడా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న ఈయన.. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో కనిపిస్తూ పలువురు హీరోలపై చేసే కామెంట్లు ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దేవుడు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ.. తనను ఆయన నుంచి దూరం చేశారు అంటూ త్రివిక్రమ్ (Trivikram) ఇండైరెక్టుగా టార్గెట్ చేశారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannath)పై కూడా కామెంట్లు చేశారు బండ్లన్న. ఇప్పుడు ఏకంగా అల్లు అరవింద్ (Allu Aravind) ను టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. తాజాగా చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది లిటిల్ హార్ట్స్ (Little hearts).
90 బయోపిక్ వెబ్ సిరీస్ మౌళి (Mouli )హీరోగా, శివాని నాగారం (Shivani Nagaram) జంటగా వచ్చిన చిత్రం ‘ లిటిల్ హార్ట్స్ ‘. చిన్న సినిమాగా విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ (Allu Aravindh), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బండ్ల గణేష్ (Bandla Ganesh) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా బండ్ల గణేష్ అల్లు అరవింద్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లకు బన్నీ వాసు (Bunny Vasu) కౌంటర్ ఇవ్వగా దిగివచ్చిన బండ్ల గణేష్ ఊహించని ట్వీట్ చేశారు.
బన్నీ వాసు కౌంటర్ కి దిగొచ్చిన బండ్లను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. “అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బాస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వలన తెలుగు సినిమా గర్వంగా నిలిచింది. అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం” అంటూ బండ్ల గణేష్ లవ్ ఎమోజితో ట్వీట్ షేర్ చేశారు. మొత్తానికి అయితే బన్నీ వాసు దెబ్బకు బండ్లన్న దిగివచ్చి అల్లు అరవింద్ దేవుడు అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
సక్సెస్ మీట్ లో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో ఒక పెద్దాయన ఉంటాడు. ఒక స్టార్ కమెడియన్ కి కొడుకుగా పుడతాడు. మెగాస్టార్ కి బామ్మర్దిగా, ఐకాన్ స్టార్ కి తండ్రిగా ఉంటాడు. కాలు మీద కాలు వేసుకొని ఉంటాడు. ఎవరికి అందుబాటులో ఉండడు. ఆయన తలుచుకుంటే ఎవరైనా సరే ఆయన అందుబాటులోకి వస్తారు. ఆయన మహర్జాతకుడు. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు. షర్టు నలగదు.. జుట్టు చెదరదు.. కానీ వేలకోట్లు సంపాదిస్తాడు” అంటూ అల్లు అరవింద్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.
బండ్ల గణేష్ కి కౌంటర్ ఇచ్చిన బన్నీ వాసు..
అయితే బండ్ల గణేష్ చేసిన కామెంట్లకు అల్లు అరవింద్ శిష్యుడిగా , ప్రముఖ నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బన్నీ వాసు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..” ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారేమో.. అల్లు అరవింద్ రామలింగయ్య అనే స్టార్ కమెడియన్ కి పుట్టడం కాదు.. అల్లు అరవింద్ పుట్టిన తరువాతనే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు.. బండ్లన్నకు ఈ విషయం తెలియదేమో” అంటూ కౌంటర్ ఇచ్చారు బన్నీ వాసు.
ALSO READ:Nag Ashwin : కర్మను ఎవరు తప్పించుకోలేరు.. దీపికాకు డైరెక్టర్ కౌంటర్!
అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత 🙏
ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్స్.
ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వలన తెలుగు సినిమా గర్వంగా నిలిచింది.
అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం ❤️ 🙏— BANDLA GANESH. (@ganeshbandla) September 19, 2025