హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. చాలా మంది వర్షానికి ముందే ఇంటికి చేరుకుంటున్నారు. హాయిగా రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే, ఆ ఫుడ్ డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జొమాటో బాయ్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ ను లెక్క చేయకుండా అనుకున్న సమయంలోగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ ఇస్తున్నారు. ఓ వైపు ఫుడ్ డెలివరీ చేయడమే కాదు, వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వాహనదారులకూ సాయం చేస్తున్నారు. అందరి చేత శభాష్ అని ప్రశంసలు పొందుతున్నారు.
ఇక తాజాగా కురిసిన వర్షంలో సుమిత్ అనే వ్యక్తి ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ వరదల్లో చిక్కుకున్నాడు. వరద ప్రవాహానికి బైక్ మీది నుంచి కిందపడిపోయాడు. వరద తీవ్రతకు అతడి బైక్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొన్నది. ఇంతలోగా అటు వైపు గా స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ వచ్చారు. వెంటనే అతడిని లేపి పక్కకు తీసుకెళ్లారు. అతడి బైక్ కు వరద నుంచి బయటకు తీశారు. కొట్టుకు పోతున్న అతడి బ్యాగ్ సహా ఇతర వస్తువులను పట్టుకుని అతడికి అప్పగించారు. ఈ వీడియోను సుమిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనను వరద ముప్పు నుంచి కాపాడిని జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ కు కృతజ్ఞతలు చెప్పాడు. “ఈ వరద సమయంలో జొమాటో, స్విగ్గీ రైడర్లు ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా, వరద నీటిలో కొట్టుకుపోతున్న నన్ను, నా బైక్ ను కాపాడారు. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తున్నారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న నాలాంటి వందలాది మందికి వారు ఇలాగే చేశారు” అని చెప్పుకొచ్చాడు.
Hey @zomato @Swiggy, just wanted to share that your riders not only delivered food during this deluge, but also saved me and my bike from being swept away in the stormwater. They did the same for hundreds of people like me trying to reach home at midnight in Hyderabad. pic.twitter.com/gsgw5UyGW4
— Sumit Jha (@sumitjha__) September 17, 2025
Read Also: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!
అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి ఫిదా అవుతున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ ప్లడ్ లో సాయం చేయడాన్ని ప్రశంసిస్తున్నారు. వాళ్లు నిజమైన హీరోలు అంటూ అభినందిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు కష్టాల విలువ తెలుసు కాబట్టే ఇతరులను కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. సదరు ఫుడ్ డెలివరీ యాప్స్ వారిని నిజంగా సన్మానించాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు. భారీ వర్షంలో పొరుగు వారికి సాయం చేయాలనే ఆలోచన కొంత మందికే ఉంటుందని, అలాంటి వారే ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటూ అభినందిస్తున్నారు. మొత్తంగా హైదరాబాదీయులు సదరు యువకులను మనస్పూర్తిగా కొనియాడుతున్నారు.
Read Also: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!