Dussehra Holidays: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది గుడ్ న్యూస్.. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ భారీ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులను కాస్త ముందుగానే ప్రకటించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్ నేపథ్యంలో.. దీంతో ముందుగా నిర్ణయించిన సెలవులకు అదనంగా మరో రెండు రోజులను జోడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటన తో రాష్ట్ర ప్రజలతో పాటు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ ట్వీట్..
రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు ప్రకటిస్తున్నట్టు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ట్వి్ట్టర్ వేదికగా తెలిపారు. రాష్ట్రంలో స్కూళ్ల దసరా పండగ సెలవులు రెండు రోజులు ముందుగానే ఇవ్వాలని టీచర్లు, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నట్టు తెలుగు దేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. దీంతో విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
సెలవులు: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు..
ఈ నెల 22 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు..
నిజానికి.. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరానికి దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ నెల 22 నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సెలవులు రెండు రోజులు ముందుగానే ప్రకటించాలని విద్యార్థులు తల్లిదండ్రులు, టీచర్ల నుంచి డిమాండ్స్ వినిపించాయి.
ALSO READ: Sabarimala: శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.54 కేజీల బంగారం మాయం..
తెలంగాణలో 21 నుంచే..
అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణ సెప్టెంబర్ 21 నుంచే అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తు ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో ఏపీ ప్రభుత్వంపై టీచర్ల నుంచి, స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. అటు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీలు సైతం సెలవులు పొడగించాలని కోరడంతో మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందిచినట్లు తెలుస్తోంది.
ALSO READ: CM Revanthreddy: విశ్వనగరంగా హైదరాబాద్.. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి-సీఎం రేవంత్