Paradha Official Trailer Out: అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పరదా’. బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 22న విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ లైన్ క్లియర్ అయ్యి ఆగస్టు 22న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు, టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి.
ట్రైలర్ విషయానికి వస్తే..
ఇందులో అనుపమ పాత్ర సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిగా సాగుతూ చిత్రంపై బజ్ పెంచుతోంది. 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రధాన పాత్రల చూట్టు తిరుగింది. నటి సంగీత ఇందులో కీలక పాత్రలో కనిపించింది. వింత ఆచారాలు పాటించే గ్రామం నుంచి పర్యటనకు వెళ్లిన ఆ వెళ్లిన విలేజ్ అమ్మాయి.. ఆ తర్వాత ఆ గ్రామం పెద్దల ఎదుర్కొన్న అవమానాలు, ఆరోపణలు నేపథ్యంలో ఈ పరదా సాగనుంది ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ఆడియన్స్ ఉత్కంఠ, ఆసక్తిని పెంచుతున్నాయి.
కాగా ఓ ఊరి దురాచారాలకు సంబధించిన కథ ఇది. ఈ గ్రామంలోని ఆడపిల్లలు పరదా వేసుకుని ఉండాలి. తమ ముఖం ఎవరికి చూపించకుడదు. అలాంటి గ్రామానికి చెందిన యువతిగా ఉన్న సుబ్బు(అనుపమ) ఆ ఊరి దురాచారాలను ఎలా ఎదుర్కొంది, ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిణామాల ఏంటనేది పరదా కథ. ఈ చిత్రంలో దర్శనా రాజేంద్రన్ కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్ ప్రకారం చూస్తే.. అనుపమ ప్రియుడిగా నటించినట్టు తెలుస్తోంది. కాగా చిన్న సినిమా వస్తున్న పరదా రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ చేసుకోవడం విశేషం.
ఓటీటీ డీల్ క్లోజ్
ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గం ఫ్యాన్సీ రేట్ కు కొనుగోలు చేసిందట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడదలైన ప్రచార పోస్టర్స్ విశేష ఆదరణ దక్కింది. చిత్రం ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది. మూవీ కి ఉన్న బజ్ నేపథ్యంలో కంటెంట్ పై నమ్మకంగా అమెజాన్ ప్రైం వీడియోస్ విడుదలకు ముందే పరదా ఓటీటీ రైట్స్ తీసుకుందట. అదీ కూడా రూ. 40 కోట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిందట. ప్రస్తుతం పెద్ద సినిమాల ఓటీటీ రిలీజ్ పై ఎన్నో కండిషన్స్ పెడుతున్నారు. విడుదల తర్వాత మూవీ ఫలితాన్ని బట్టి డిజిటల్ సంస్థలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అలాంటి చిన్న సినిమా, అది కూడా గ్రామీణ నేపథ్యం ఉన్న పరదాని నమ్మి.. అమెజాన్ రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ పూర్తి చేసుకోవడంతో మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. పరదాలో అంత ప్రత్యేకత ఏముంది? అంటూ సినిమా చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.