Indian Railways: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ఉత్తర భారతాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ లో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే పరిధిలోని జమ్మూ డివిజన్ కథువా-మాధోపూర్ పంజాబ్ స్టేషన్ల మధ్య ఉన్న బ్రిడ్జి నంబర్ 17 తీవ్రంగా దెబ్బ తిన్నది. దీని ప్రభావంతో జోధ్ పూర్ డివిజన్ ను కలిపే 10 రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని జోధ్ పూర్ DRM అనురాగ్ త్రిపాఠి అధికారికంగా వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ నెల 30 వరకు మొత్తం ఆరు రైళ్లు పూర్తిగా రద్దు చేయబడతాయన్నారు. మరో నాలుగు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడతాయని తెలిపారు.
సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు క్యాన్సిల్ అయిన రైళ్లు
⦿ రైలు నంబర్ 14661: బార్మర్-జమ్మూ తావి ఎక్స్ ప్రెస్
⦿ రైలు నంబర్ 14662: జమ్మూ తావి-బార్మర్ ఎక్స్ ప్రెస్
రద్దైన పలు వీక్లీ రైళ్లు
⦿ రైలు నంబర్ 19027: బాంద్రా టెర్మినస్-జమ్మూ తావి (సెప్టెంబర్ 6, 13, 20, 27న రద్దు చేయబడింది)
⦿ రైలు నంబర్ 19028: జమ్మూ తావి-బాంద్రా టెర్మినస్ (సెప్టెంబర్ 8, 15, 22, 29న రద్దు చేయబడింది)
⦿ రైలు నంబర్ 19107: భావ్‌నగర్ టెర్మినస్-షాహిద్ కెప్టెన్ తుషార్ మహాజన్ (సెప్టెంబర్ 7, 14, 21, 28న రద్దు చేయబడింది)
రైలు నంబర్ 19108: షాహిద్ కెప్టెన్ తుషార్ మహాజన్-భావ్‌నగర్ టెర్మినస్ (సెప్టెంబర్ 8, 15, 22, 29న రద్దు చేయబడింది)
Read Also: ఫస్ట్ వందేభారత్ పరుగులు తీసేది ఈ రూట్ లోనే, టికెట్ ఛార్జీ ఎంతో తెలుసా?
పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్లు
భగత్ కి కోఠి-జమ్మూ తావి రూట్
⦿ రైలు నంబర్ 14803: సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 30 వరకు భగత్ కి కోఠి నుంచి ఫిరోజ్ పూర్ కాంట్ వరకు నడుస్తుంది.
⦿ రైలు నంబర్ 14804: సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 30 వరకు జమ్మూ తావికి బదులుగా ఫిరోజ్ పూర్ కాంట్ నుంచి ప్రారంభమవుతుంది.
సబర్మతి-జమ్మూ తావి రూట్
⦿ రైలు నంబర్ 19223: సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 30 వరకు సబర్మతి నుంచి ఫిరోజ్ పూర్ కాంట్ వరకు నడుస్తుంది.
⦿ రైలు నంబర్ 19224: సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 30 వరకు జమ్మూ తావికి బదులుగా ఫిరోజ్ పూర్ కాంట్ నుంచి ప్రారంభమవుతుంది.
ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు రైల్వే అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేయాలన్నారు DRM త్రిపాఠి. లేదంటే హెల్ప్ లైన్ నుంచి రైళ్ల స్టేటస్ ను తెలుసుకోవాలని సూచించారు.
Read Also: విశాఖలో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్.. ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందంటే?