Anushka Shetty: అనుష్క శెట్టి (Anushka Shetty).. ఎక్కడో యోగా టీచర్ గా వృత్తిని కొనసాగిస్తూ.. కెరియర్ సాగిస్తున్న అనుష్క శెట్టి పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna ) హీరోగా నటించిన ‘సూపర్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం లభించింది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని రికార్డు సృష్టించింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు అందుకుంది. ముఖ్యంగా ‘అరుంధతి’ లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాహుబలి, బాహుబలి 2 వంటి పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు తలుపు తడతాయి అనుకున్నారు కానీ అది జరగలేదు.
42 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోని అనుష్క ..
ఈ సినిమా తర్వాత భాగమతి, నిశ్శబ్దం, సైజ్ జీరో వంటి సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. మళ్లీ నవీన్ పోలిశెట్టి (Naveen polishetty) తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేసింది. ఈ సినిమా తర్వాత మళ్లీ కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఇలా కెరియర్ పరంగా వరుస సినిమాలు చేస్తోంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆలోచించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. పైగా పెళ్లీడు కూడా దాటిపోయింది. కనీసం ఇప్పుడైనా వివాహం చేసుకుంటుంది అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. అటు హీరో ప్రభాస్ (Prabhas) ను పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజం లేదు.
ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క..
దీంతో అనుష్క ఎప్పుడు వివాహం చేసుకుంటుంది అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా రోజులకు పెళ్లిపై స్పందించింది అనుష్క శెట్టి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క మాట్లాడుతూ..” బాహుబలి సినిమా తర్వాత నుంచే నాపై పెళ్లి ఒత్తిడి పెరిగింది. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారు. దీనికి తోడు మీడియాలో ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. నాకు కూడా పెళ్లిపై నమ్మకం ఉంది. కానీ సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను.. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ప్రేమించకుండా ఎవరిని పెళ్లి చేసుకోను.. ఏదేమైనా నాకు ఇష్టమైన వ్యక్తినే నేను వివాహం చేసుకుంటాను కాకపోతే సరైన వ్యక్తి , సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చింది అనుష్క. మొత్తానికి అయితే సినిమాలతో సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకుంటానని, తనకు నచ్చినవాడు దొరికితేనే వివాహం చేసుకుంటాను అని కూడా స్పష్టం చేసింది.
ALSO READ:Samantha: హైలెట్ గా నిలిచిన సమంత స్పెషల్ రింగ్.. అసలు కథ ఏంటంటే?