BigTV English

Samantha: హైలెట్ గా నిలిచిన సమంత స్పెషల్ రింగ్.. అసలు కథ ఏంటంటే?

Samantha: హైలెట్ గా నిలిచిన సమంత స్పెషల్ రింగ్.. అసలు కథ ఏంటంటే?

Samantha:సమంత (Samantha) .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత.. ఈ మధ్య బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అక్కడే పలు కథలు వింటున్నట్లు సమాచారం. ఇదివరకే ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి, గట్టి కం బ్యాక్ అందుకుంది సమంత. ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో స్టార్ హీరో రేంజ్ లో అదరగొట్టేసింది. ఇక సినిమాల పరంగా కాస్త పక్కన పెడితే.. ఈ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj nidimoru) తో సమంత కాస్త చనువుగా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు దారి తీస్తోంది.


రాజ్ నిడిమోరుతో పెరుగుతున్న సాన్నిహిత్యం..

ఎక్కడికి వెళ్లినా అతడిని వెంట తీసుకెళ్లడం , అతని భుజంపై తలపెట్టి పడుకోవడం..దీనికి తోడు రీసెంట్ గా ఒకే కారులో కనిపించడం చూసి ..రాజ్ నిడిమోరు తో రహస్య ఎఫైర్ కొనసాగిస్తోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ నెటిజన్స్ కూడా వార్తలు వైరల్ చేస్తున్నారు. దీనికి తోడు డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ దే కూడా ఇన్ డైరెక్ట్ గా పోస్ట్లు పెట్టడంతో నిజంగానే వీరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


సమంత వేలికి స్పెషల్ రింగ్..

ఇక ఇలాంటి సమయంలో సమంత.. తన వేలికి ధరించిన ఉంగరాన్ని హైలైట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలలో రాజ్ నిడిమోరు కనిపించడం లేదు కానీ.. సమంత ఒక కెఫే లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నట్లు ఆ ఫోటోలు పంచుకుంది. అయితే అందులో అభిమానుల దృష్టి ఆమె చేస్తున్న బ్రేక్ఫాస్ట్ పై కాకుండా ఆమె చేతి వేళ్లపైన పడిందని చెప్పవచ్చు. డైమండ్స్ పొదిగినట్లు కనిపిస్తున్న ఆ ఉంగరం.. మధ్యలో ఒక పెద్ద లైట్ పింక్ కలర్ స్టోన్ పొదిగి ఉంది. చుట్టూ డైమండ్స్ పొదిగి చాలా అందంగా, యూనిక్ గా దానిని డిజైన్ చేశారు. ఈ ఉంగరం ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఎందుకంటే సమంత చేతికి ఇటువంటి ప్రత్యేకమైన ఉంగరాలు ఎప్పుడు కనిపించలేదు. కానీ ఇప్పుడు సడన్ గా ఇలాంటి యూనిక్ డిజైన్ కలిగిన ఉంగరం హైలెట్ అవడంతో అందరూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఉంగరాన్ని ఈమె ధరించడం వెనుక అసలు కారణం ఏమిటో తెలియదు కానీ.. నెటిజన్స్ మాత్రం ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సమంత – రాజ్ మధ్య బంధం ఏమిటి..?

ఇకపోతే తొలిసారి ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది సమంత. ఈ వెబ్ సిరీస్ కి రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సిటాడెల్ – హనీ బన్నీ వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇలా వరుస వెబ్ సిరీస్ లకి కలసి పనిచేస్తుండడంతో.. వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు బహిరంగ ప్రదేశాలలో, ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా వీరి బంధాన్ని మరింత హైలెట్ చేస్తున్నారు . ఇక మరి వీరి మధ్య ఉన్న అసలైన బంధం ఏమిటో తెలియదు కానీ వీరిద్దరిపై మాత్రం ఇప్పుడు ఎఫైర్ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.

ALSO READ:Chiru 158: స్పీడ్ పెంచిన అన్నయ్య.. త్వరలో 158వ మూవీ ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×