Naga Vamsi Conditions to War 2 Telugu Rights: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘వార్ 2’. తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్ మూవీ మంచి బజ్ పెంచాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో వార్ 2పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా తారక్ బీస్ట్ లుక్‌కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. బాలీవుడ్‌లో తమ హీరో గ్రాండ్ ఎంట్రీ ఖాయమైందని, బాక్సాఫీస్ లెక్కలు తారుమారే అంటూ ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటారు. ఇక ఈ సినిమా ఆగష్టు 14న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
వార్ 2ని నమ్మని నాగవంశీ
ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితులు వింతగా ఉన్నాయి. స్టార్ హీరో సినిమా అయినా పెద్దగా బజ్ కనిపించడం లేదు. హరి హర వీరమల్లు విషయంలో ఇది రుజువైంది. భారీ యాక్షన్, పాన్ ఇండియా బజ్ ఉన్న వీరమల్లుకు ఇవేవి ప్లస్ కాలేకపోయాయి. ఇక మార్కెట్ కూడా పెద్దగా జరగడం లేదు. నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్స్ అంతా కూడా మూవీకి వస్తున్న రెస్పాన్స్, ఆడియన్స్ ఆసక్తిని బట్టే మూవీకి రైట్స్ ఫిక్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు హరి హర వీరమల్లు బయ్యర్లు లేక ఇబ్బంది పడింది. అయితే ఇప్పుడు వార్ 2కి విపరీతమైన బజ్ ఉంది. కానీ, ఈ సినిమాను నిర్మాతలు నమ్మే సాహసం చేయడం లేదు.
బయ్యర్లకు ఆ కండిషన్
వార్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్‌ని నిర్మాత నాగవంశీ తీసుకున్నారు. దాదాపు రూ. 81 కోట్లకు మూవీని తీసుకున్నారట. ఇప్పటికే డిస్ట్రీబ్యూట్ కూడా చేసేసాడట. కానీ, మూవీ రిజల్ట్‌పై బయ్యర్లకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నాడని ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆ రిస్క్ బయ్యర్లకేనట. ఓ నిర్మాత తన సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు బయ్యర్లకు ఓ హామి ఇస్తాడు. ఈ సినిమా ఆశించిన టాక్, కలెక్షన్స్ చేయకపోతే నెక్ట్స్ మూవీకి చూసుకుందామని వారి భరోసా ఇస్తుంటారు. కానీ, ఈ విషయంలో నాగవంశీ చేతులెత్తాశారట.
వార్ 2 ఫలితం ఏదైన మీదే బాధ్యత అని డీల్ చేసుకున్నారట. ఇక ఎన్టీఆర్‌పై ఉన్న నమ్మకంతో బయ్యర్లు కూడా ఈ ఒప్పందానికి ఒకే చెప్పారట. దీంతో నాగవంశీ భలే తప్పించుకున్నారే సినీసర్కిల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే దక్షిణాదిలో వార్ 2 సినిమాతో పోలిస్తే.. కూలీపైనే ఎక్కువ బజ్ ఉంది. లోకేష్ కనగరాజ్ తమిళ దర్శకుడైనా.. తెలుగులో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. విక్రమ్, లియో చిత్రాలతో కోలివుడ్‌కి కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. తెలుగులోనూ ఆయన సినిమాలు భారీగా వసూళ్లు చేశాయి. కమల్, విజయ్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మించి హీరోలను ఎలివేట్ చేసి చూపించాడు. డైరెక్షన్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ చూపించి అతి తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్‌గా మారాడు.
వార్ 2పై కూలిదే పై చేయి
లోకేష్ దర్శకత్వంలో మూవీ అంటే ఇండస్ట్రీ హిట్ పక్కా అన్నట్టు మారింది. జైలర్ సినిమా రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.ఇదే కాంబో కూలీలో రిపీట్ అవుతుంది. రజనీ మ్యానరిజం, లోకేష్ కనగరాజ్ ఎలివేషన్, అనిరుధ్ సంగీతం.. ఈ రేర్ కాంబోలో కూలి మూవీ రూపుదిద్దుకుంటోంది. దీంతో కూలి మూవీపై విపరీతమైన బజ్ ఉంది. తమిళంలోనే తెలుగులోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదీ కూడా వార్ 2 మించి ఉండటం విశేషం. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలో వస్తుండటంతో వార్ 2 వర్సెస్ కూలీ అనేలా ఉంది పరిస్థితి. మరి ఆగష్టు 14న వార్ 2పై కూలిదే పై చేయి ఉంటుందా? లేక కూలిని వెక్కినెట్టి వార్ 2 బాక్సాపీసు వద్ద దూకుడు చూపిస్తుందా? చూడాలి.
Also Read: kingdom collection: నాగవంశీ సార్.. ఈ కలెక్షన్స్ నిజమేనా?.. ఇంతకి ఇవి మివా.. మావా?