Rajasthan: రాజస్థాన్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జైపుర్- అజ్మీర్ హైవేపై మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును వెనకనుండి మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ పేలుడు శబ్దాలు వినిపించాయి. మరో వైపు ప్రమాద కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. బాధితులను హాస్పటిల్‌కి తరలించారు.