Allu Arjun Fans: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న బన్నీ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న అల్లు అర్జున్ విషయంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు కీలక భేటీ నిర్వహించారు. ఏపీ, తెలంగాణకు చెందిన అభిమాన సంఘాల ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి పలు నిర్ణయాలను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి అల్లు అర్జున్ దూరంగా ఉన్నప్పటికీ ఆయన పీఏ శరత్ చంద్ర నాయుడు హాజరయ్యారు..
ఫ్యాన్స్ వార్ వద్దు…
ఇక ఈ సమావేశంలో భాగంగా అల్లు అర్జున్ సినిమాల గురించి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలు విషయంలో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, AA 22 సినిమా గురించి కూడా అభిమానులు ప్రెసిడెంట్లతో పలు చర్చలు జరిపినట్టు సమాచారం . ఇటీవల కాలంలో హీరోల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. యాంటీ ఫ్యాన్స్ నుంచి వచ్చే విమర్శల గురించి, ఫ్యాన్స్ వార్ వంటి వాటి గురించి ఈ మీటింగ్లో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇటీవల పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చర్చలు జరిగినట్టు సమాచారం.
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్
ఇక అల్లు అర్జున్ విషయంలో పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నటువంటి అభిమానులకు కూడా ఈ సందర్భంగా బన్నీ పిఏ శరత్ చంద్ర నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ రేసులో ఉండడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పుష్ప 2 సినిమా ఆస్కార్ రేసులో ఉన్న నేపథ్యంలో అభిమానులు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా కచ్చితంగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ramgopal Varma: శివ రీ రిలీజ్… వర్మ షాకింగ్ రియాక్షన్ …పిల్లల సినిమా కాదు కానీ!