Cyber Attack: యూరప్ దేశాల్లో పలు కీలక ఎయిర్ పోర్టులు సైబర్ దాడికి గురయ్యాయి. లండన్ లోని హిత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలో బెర్లిన్ సహా మరికొన్ని ఎయిర్ పోర్టుల్లో విమాన సర్వీసులకు ఇబ్బంది తలెత్తింది. సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. దీంతో చెక్ ఇన్, బోర్డిగ్ వ్యవస్థలు లాంటి సేవలు నిలిచిపోయాయని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
ఎయిర్ పోర్టు సర్వీసుల్లో ఇబ్బందులు తలెత్తడంతో చాలా విమానాలు ఆలస్యం అయినట్టు అధికారులు చెప్పారు. కొన్ని విమానాలు అయితే రద్దయినట్టు పేర్కొన్నారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. గమ్యస్థానాలు చేరుకోలేక ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. ఎయిర్ పోర్టు సర్వీసులకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ఎయిర్ పోర్ట్ వెబ్ సైట్లను పరిశీలిస్తూ ఉండాలని ఎయిర్ పోర్టు అధికారులు ప్రయాణికులకు కీలక సూచనలు ఇచ్చారు.
ALSO READ: Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మసంబురాలు ఎప్పటి నుంచి ?
సైబర్ అటాక్ వల్ల బ్రస్సెల్ ఎయిర్ పోర్ట్ లోని చెక్ ఇన్, బోర్డింగ్ సేవల్లో పూర్తి అంతరాయం ఏర్పడినట్టు విమానశ్రాయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేందుకు తమ టెక్నికల్ టీం తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని.. త్వరలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. సేవలు అందుబాటులోకి రాగానే ప్రయాణికులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.
ALSO READ: Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి
యూరప్‌లోని దాదాపు అన్ని ముఖ్యమైన ఎయిర్ పోర్ట్ లు ఇబ్బందులకు గురైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. సిస్టమ్ ప్రొవైడర్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విమానాలు లేట్ అవ్వడంతో పాటు.. పలు విమానాలు రద్ద అయ్యాయని వివరించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాయి. హిత్రో, బ్రెస్సెల్స్, బెర్లిన్ లాంటి పలు కీలక విమానాశ్రయాలపై జరిగిన భారీ సైబర్ దాడితో విమానయాన సేవలు అస్తవ్యస్తంగా మారాయి.