Mohanlal: మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు గడించిన మోహన్ లాల్ (Mohan Lal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు మాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు ఇతర భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో మెప్పిస్తున్నారు. అలా పాన్ ఇండియా నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఈ మధ్యకాలంలో బ్లాక్ బాస్టర్ విజయాలను వరుసగా అందుకుంటూ హ్యాట్రిక్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. అంతేకాదు మలయాళ సినీ పరిశ్రమలో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి నటుడిగా కూడా రికార్డు సృష్టించారు మోహన్ లాల్.
L2: ఎంపూరాన్, తుడరుమ్, హృదయపూర్వం.. ఈ మూడు చిత్రాలతో వరుసగా రూ.50 కోట్ల క్లబ్లో చేరి హ్యాట్రిక్ సక్సెస్ అందుకొని రికార్డ్ సృష్టించారు మోహన్ లాల్. అలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన తాజాగా నటించిన చిత్రం ‘హృదయపూర్వం’. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇందులో మాళవిక మోహనన్ (Malavika mohanan), సంగీత్ ప్రతాప్ (Sangeeth prathap)హీరోయిన్లుగా నటించారు. క్లాసిక్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సత్యన్ అంతికాడ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరంబవూర్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.
సెప్టెంబర్ 26 నుండి స్ట్రీమింగ్..
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మలయాళం తో పాటు తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో సినిమాను మిస్ చేసుకున్న వాళ్లు ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఇకపోతే రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.70 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు లాభాల వర్షం కురిపించింది.
హృదయపూర్వం సినిమా స్టోరీ..
హృదయపూర్వం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలో క్లైడ్ కిచెన్ యజమాని సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్) కి గుండె మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. అయితే మిలిటరీ అధికారి రవి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను పూణే నుంచి కొచ్చికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. సందీప్ ఇంకా బ్రహ్మచారి గానే ఉంటాడు. గుండె మార్పిడి తర్వాత మిలిటరీ అధికారి రవి కూతురు హరిత (మాళవిక మోహనన్) తన ఎంగేజ్మెంట్ కోసం సందీప్ ను పూణేకు ఆహ్వానిస్తుంది. తన తండ్రి గుండెను అమర్చిన సందీప్ ని చూసి అటు హరిత ఇటు రవి భార్య దేవిక (సంగీత మాధవన్ నాయర్) ఇద్దరు ఎమోషనల్ అయిపోతారు. ఆయనకు కనెక్ట్ అవుతారు. ఎంగేజ్మెంట్ కు వెళ్లిన సందీప్ ఒక కారణం చేత వాళ్ళ ఇంట్లోనే కొన్నాళ్లు ఉండిపోవాల్సి వస్తుంది.. హరిత ఎంగేజ్మెంట్ కి వెళ్ళిన సందీప్ అక్కడే ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అసలు సందీప్ కి ఎందుకు గుండె మార్పిడి చేయాల్సి వచ్చింది? సందీప్ ఎందుకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు? ఇలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
എന്ന് ഹൃദയപൂർവം ജിയോഹോട്ട്സ്റ്റാർ#Hridayapoorvam will be streaming from September 26 on JioHotstar. @mohanlal @antonypbvr @aashirvadcine @MalavikaM_#Hridayapoorvam #HridayapoorvamOnJioHotstar #Mohanlal #HridayapoorvamMohanlal #Family #Drama #Comedy #Malayalam #JioHotstar pic.twitter.com/r8Q1hL4JEv
— JioHotstar Malayalam (@JioHotstarMal) September 19, 2025
also read: SDT: సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ.. దిగ్గజాలంతా ఒకే చోట.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా.?