Ramgopal Varma: ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి. ఈ క్రమంలోనే కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సినీ కెరియర్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలో ఉన్నాయి. ఈ క్రమంలోనే నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ(Ramgopal Varma) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ సినిమాని(Siva Movie) కూడా తిరిగి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
నాగార్జున హీరోగా దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. గత కొంతకాలంగా ఈ సినిమా రీ రిలీజ్ గురించి వార్తలు వస్తున్నాయి. అయితే నేడు అక్కినేని నాగేశ్వరరావు గారి101 వ జయంతి సందర్భంగా నాగార్జున ఈ సినిమా రీ రిలీజ్ తేదీని తెలియజేస్తే సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. నవంబర్ 14వ తేదీ శివ సినిమా తిరిగి 4కే వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందంటూ నాగార్జున ఈ సందర్భంగా శివ సినిమా రీ రిలీజ్ గురించి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పిల్లల సినిమా కాదు…
ఇక నాగార్జున చేసిన ఈ ట్వీట్ పై వర్మ స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ… శివ సినిమా పిల్లల సినిమా కాదు, కానీ చిల్డ్రన్స్ డే రోజు తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా చిల్డ్రన్స్ డే రోజు రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చాలామంది మొహాలలో పిల్లల గ్లే కనిపిస్తుంది అంటూ వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పాలి. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో సంచలనాలను సృష్టించింది.
Hey @iamnagarjuna , It’s not a CHILDREN’S FILM but coming back on CHILDREN’S DAY will put CHILDREN’S GLEE on a lot of FACES https://t.co/N371z2SPIg
— Ram Gopal Varma (@RGVzoomin) September 20, 2025
ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా అమల (Amala) హీరోయిన్ గా నటించగా విలన్ పాత్రలో రఘువరన్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఒకప్పుడు వర్మ సినిమా అంటే ఆ సినిమాలకు ఎంతో మంది అభిమానులు ఉండేవారు ఈయన సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ అవుతూ అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే ఇటీవల వర్మ సినిమాలు పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున విషయానికి వస్తే ఇప్పటికే 99 సినిమాలలో హీరోగా నటించిన ఈయన త్వరలో తన 100 వ సినిమాని కూడా ప్రకటించబోతున్నారు. ఇలా హీరోగా మాత్రమే కాకుండా నాగార్జున ఇటీవల కాలంలో పలు సినిమాలలో క్యామియో పాత్రలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూలీ, కుబేర వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: OG Movie : ఓజీ మూవీ బిగ్ డిజాస్టార్… కారణం పవన్ కళ్యాణే ?