బెనిఫిట్ షోస్ తోపాటు రిలీజ్ తర్వాత రెండు మూడు రోజులు హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో అభిమానుల సందడి మనం చూశాం. ఇప్పుడిక ఫ్యామిలీల వంతు. కుటుంబాలతో సహా థియేటర్లకు వెళ్తున్నారు రాజకీయ నాయకులు. తాజాగా నెల్లూరులో సోమిరెడ్డి కుటుంబ సమేతంగా సినిమా చూశారు. ఆయన మనవడికి కూడా సినిమా నచ్చిందన్నారు. అటు జనసేన నేతలు కూడా ఫస్ట్ డే అభిమానులతో కలసి సినిమా చూసి, ఇప్పుడు ఫ్యామిలీస్ ని వెంటబెట్టుకుని వస్తున్నారు. ఏపీలో ఇదో కొత్త ట్రెండ్ అవుతోంది.
నెల్లూరు ఎస్2 థియేటర్ కాంప్లెక్స్ లో ఈ రోజు @PawanKalyan గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా చూశాను. చాలా మంచి సినిమా..హార్ట్ టచింగ్ ఫిల్మ్..మా డిప్యూటీ సీఎం గారి నటన చాలా బాగుంది. సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. హిందువులను కాపాడటం వంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి.… pic.twitter.com/VGM0TtHVH4
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) July 25, 2025
పొలిటికల్ సినీ సందడి..
రాజకీయ నాయకులు వారి వారసులు సినిమాలు తీసినప్పుడు థియేటర్ల వద్ద పొలిటికల్ సందడి కూడా నెలకొంటుంది. గతంలో మగధీర రిలీజ్ టైమ్ లో కూడా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఇలాంటి సందడే కనపడింది. అప్పటికి చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నారు. మగధీర సినిమా రిలీజ్ తర్వాత చాలామంది పొలిటీషియన్లు ఫ్యామిలీస్ తో కలసి సినిమా చూశారు. రాను రాను సినిమాలు, రాజకీయాలకు మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి. సినిమా ఫంక్షన్లలో రాజకీయ నాయకుల సందడి కూడా పెరిగింది. ఏపీకి సంబంధించి పవన్ కల్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం కావడంతో ఇక్కడ రాజకీయాల్లో కూడా సినిమా సందడి మొదలైంది.
గతంలో పవన్ సినిమా అంటే మెగాభిమానులు, జనసైనికులకు పండగలా ఉండేది. ఇప్పుడు పవన్ కూటమి నేత కావడంతో టీడీపీ నుంచి కూడా పూర్తి సపోర్ట్ లభించింది. అటు బీజేపీ నేతలు కూడా ఈ సినిమాకి ప్రచారం మొదలు పెట్టారు. అందులోనూ ఇది సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా అంటూ ప్రచారం చేపట్టారు నేతలు. రాజకీయ నాయకులంతా వీకెండ్ లో ఫ్యామిలీస్ తో కలసి హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో సందడి చేస్తున్నారు.
రాజకీయాల్లో పొలిటికల్ డైలాగులు
ఏపీ రాజకీయాల్లో ఇటీవల పొలిటికల్ డైలాగులు బాగా ఫేమస్ అయ్యాయి. అందులో రప్పా రప్పా ఒకటి. ప్రతిపక్ష నేత జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు చాలామంది రప్ప రప్ప డైలాగ్ ని విపరీతంగా ప్రచారంలోకి తెచ్చారు. ప్రభుత్వానికి ఆ డైలాగులు ఇష్టం లేకపోతే మరి సినిమాల్లో ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు జగన్. ఆ సంగతి పక్కనపెడితే హరిహర వీరమల్లు టైమ్ కి పొలిటికల్ స్క్రీన్ పై హడావిడి మరింత పెరిగింది. డిప్యూటీ సీఎం హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కావాలని కూటమి నేతలు సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా టీడీపీ నేతలు, జనసేన, బీజేపీ నేతలు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. అటు ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ సినిమా ఫ్లాప్ కావాలని కోరుకుంది. ఏకంగా నెగెటివ్ ప్రచారమే మొదలుపెట్టింది. వైసీపీ సొంత మీడియా, ఆ పార్టీ నడుపుతున్న సోషల్ మీడియా విభాగం కూడా హరిహర వీరమల్లుకి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. సినిమా విడుదలైన తర్వాత కూడా ఈప్రచారం ఆగలేదు. ఈ దశలో పవన్ కూడా నెగెటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించారు. వారికి అలాగే తిరిగి బదులివ్వాలంటూ సక్సెస్ మీట్ లో చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పోలీస్ కేసు పెట్టారు.