America Walmart Incident: అమెరికాలో మరో దారుణం జరిగింది. 11 మందిపై కత్తితో దాడి చేశాడు దుండుగుడు. మిచిగాన్‌లోని వాల్‌మార్ట్ సెంటర్‌లో సాయంత్రం 4:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది, ఐదుగురు తీవ్ర పరిస్థితిలో ఉన్నారని మన్సన్ మెడికల్ సెంటర్ తెలిపింది. అలాగే ముగ్గురు బాధితులు శస్త్రచికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇప్పటికే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుమానితుడి వివరాలను పోలీసులు బయటికి విడుదల చేయలేదు. దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలోని మిచిగాన్‌లో ఘటన..
గ్రాండ్ ట్రావర్స్ కౌంటీ షెరీఫ్ మైఖేల్ షీ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు, ఇందులో స్టోర్‌లోని పౌరుల సహాయం కీలకంగా ఉందని చెబుతున్నారు. ఈ దాడి యాదృచ్ఛికమని, బాధితులు ముందస్తు ఎంపిక కాలేదని తెలిపారు. అయితే అనుమానితుడు ఒంటరిగా పనిచేశాడని, అదనపు అనుమానితులు లేరని అధికారులు నిర్ధారించారు. దాడి ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియలేదు, మిచిగాన్ స్టేట్ పోలీస్ క్రైమ్ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నారు.
Also Read: టేకాఫ్ టైమ్‌లో మంటలు.. విమానంలో 173 మంది..
మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ ఈ ఘటనను “భయంకరమైన వార్త”గా అభివర్ణించి, బాధితులకు మద్దతు తెలిపారు. అంతేకాకుండా FBI స్థానిక అధికారులకు సహాయం అందిస్తోందని కూడా చెప్పారు. వాల్‌మార్ట్ స్టోర్ ప్రస్తుతం మూసివేయాలని.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజలు ఆ ప్రాంతాన్ని తప్పించాలని కోరారు. ఈ ఘటన స్థానిక సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది.. ట్రావర్స్ సిటీలో ఇటువంటి హింసాత్మక సంఘటనలు అరుదని షెరీఫ్ షీ అన్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
షాపింగ్ మాల్లో కత్తితో దుండగుడి దాడి.. 11 మందికి గాయాలు!
అమెరికాలోని మిచిగాన్‌లో ఘటన
ట్రావర్స్ సిటీలోని వాల్‌మార్ట్ వద్ద కత్తితో దాడి చేసి 11 మందిని గాయపర్చిన దుండగుడు
ఈ దాడిలో ఆరుగురు పరిస్థితి విషమం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు pic.twitter.com/Fq4jhYBuHo
— BIG TV Breaking News (@bigtvtelugu) July 27, 2025