Tollywood:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) ను మొదలుకొని నేటి యంగ్ హీరోల వరకు ఎంతో మంది చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఒక స్టార్ ప్రొడ్యూసర్.. తన కూతుర్ల మాట వినకుండా ఏకంగా రూ.26 కోట్లు నష్టపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు? ఎందుకు ఆయన తన కూతుర్ల మాటను పెడచెవిన పెట్టారు? రూ.26 కోట్ల నష్టం ఎక్కడ? ఎందుకు వచ్చింది ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ చిత్ర సీమలో అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వినీ దత్ (C.Ashwini Dutt). విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు పై ఉన్న అపారమైన అభిమానంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.. గత ఐదు సంవత్సరాలుగా అనేక ప్లాటినం, జూబ్లీ విజయాలను టాలీవుడ్ కి అందిస్తూ వస్తున్నారు. అంతే కాదు సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణని కూడా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఈ సందర్భంలో తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవాలను, చిత్ర సీమలో వస్తున్న మార్పులను, తన విజయాల్లో తన కుమార్తెల కీలక పాత్ర గురించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ..” ఈ మధ్యకాలంలో నా కూతుర్లు స్వప్న (Swapna Dutt), ప్రియాంక (Priyanka Dutt) జడ్జిమెంట్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా వారు ఎంచుకున్న కథలు, నిర్మిస్తున్న విధానమే వైజయంతి మూవీస్ బ్యానర్ ను ముందుకు నడిపిస్తోంది. ముఖ్యంగా గతంలో నా కుమార్తెలిద్దరూ “ఈ కథ మనకు సెట్ అవ్వదు డాడీ” అని హెచ్చరించారు. అయినా సరే నేను మొండితనంతో ముందుకు వెళ్లాను. ఆ తర్వాతే రూ.26 కోట్ల నష్టాన్ని నేను చవి చూసాను. ఆ ఒక్క తప్పటడుగు తర్వాత నుంచి కుమార్తెల నిర్ణయాలకే నేను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. వారి క్రియేటివిటీ, కష్టపడే తత్వమే ఈ వయసులో కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నాయి”. అంటూ 26 కోట్లు నష్టపోవడం వెనుక అసలు కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే అది ఏ సినిమాకి అన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు..
ALSO READ:డ్యాన్సర్ అసోసియేషన్లో మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫెడరేషన్ మండిపాటు!
మారుతున్న కాలానికి అనుగుణంగా చిత్ర సీమలో ఎన్నో సాంకేతిక మార్పులు వచ్చాయి. భవిష్యత్తులో డిజిటల్ ప్లాట్ ఫామ్లే రాజ్యమేలే అవకాశం ఉంది. టెక్నాలజీ మారినప్పటికీ కొన్ని విషయాల్లో నా మార్క్ ను మాత్రం నేను వదులుకోను అంటూ స్పష్టం చేశారు.