E-Paper
Advertisement

కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!

కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ క్లారిటీ!
Advertisement

Nominated Posts: స్వేచ్ఛ బ్యూరో: ఎన్నో నెలల నుంచిఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ డైరెక్టర్లు, దేవాలయ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల స్థానాల భర్తీపై అధికార పార్టీ దృష్టి సారించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్యంగా పాల్గొన్నారు.

విభేదాలకు తావులేకుండా..

రాబోయే ప్యాక్స్ పదవులతో పాటు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి పక్కా విధివిధానాలను ఈ భేటీలో ఖరారు చేశారు. నామినేటెడ్ పదవుల ఎంపికలో ఎలాంటి విభేదాలకు తావులేకుండా పారదర్శకంగా జాబితా రూపొందించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆదివారం ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రుల నేతృత్వంలో జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ,సీనియర్ నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆశావహుల వివరాలను, వారి పనితీరును సమీక్షించి, సమన్వయంతో కూడిన నివేదికను పీసీసీకి అందజేస్తారు.

Advertisement

Also Read: మార్కెట్‌‌లో కొత్త ఫ్రిజ్ రచ్చ.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది బాస్

సీనియర్లకు 60 శాతం..

ఈ దఫా విడుదల చేసే నామినేటెడ్ పదవుల్లో దాదాపు 60 శాతం సీనియర్లకే అవకాశం దక్కనున్నది. గతంలో పనిచేసిన మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు , నియోజకవర్గాల సీనియర్ నాయకులకు కేటాయించనున్నారు.అంతేగాక నామినేటెడ్ నియామకాల్లో ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలతో పాటు మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ సమతుల్యత పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక పవర్ లోకి రాకముందే జాయినింగ్స్, ఎన్నికల సమయంలో చేరినోళ్లు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాయిన్ అయిన వాళ్లకూ మిగతా 40 శాతంలో లభించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రితో చర్చించాక తుది ప్రకటన.

Advertisement

​అన్ని జిల్లాల నుంచి అందిన నివేదికలను క్రోడీకరించి తుది జాబితాను పీసీసీ సిద్ధం చేస్తుంది. ఆ తదుపరి జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడిగా సమీక్షించి ఆమోదం తెలుపుతారు. ముఖ్యమంత్రితో చర్చలు పూర్తయిన వెంటనే అధికారికంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఈ ప్రక్రియతో సుదీర్ఘకాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

Also Read: Flipkartలో రచ్చ లేపుతున్న Lava కొత్త ఫోన్లు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు బ్రో!

Related News

రంగనాథ్‌కు మద్దతుగా రోడ్డెక్కిన జనం.. ‘సేవ్ హైడ్రా’ అంటూ అమీర్‌పేట్‌లో ధర్నా!

ఆయిల్ పామ్ రైతులకు బిగ్ షాక్.. అనుకున్న టార్గెట్ అంతా తుస్సేనా..!

తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. ఖర్చు తక్కువ మజా ఎక్కువ!

డిజిటల్ సేవల్లో తెలంగాణ నయా రికార్డు.. దేశంలోనే నెంబర్ వన్ స్థానం!

లష్కర్ బోనాల జాతర.. ఉజ్జయిని మహాకాళి సేవలో సీఎం రేవంత్ రెడ్డి!

బోనాల జాతరలో భక్తుల అవస్థలు.. వీఐపీలకు స్పెషల్ దర్శనం, ప్రజాసేవలో ‘బిగ్ టీవీ’

కాళ్లు-చేతులు కట్టేసి.. భార్య గొంతు కోసిన భర్త, హనుమకొండలో దారుణం

Big Stories

Advertisement
×