Tollywood: గత కొంతకాలంగా టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్ లో మొదలైన వివాదం ఇప్పటికీ పరిష్కారమవ్వలేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా జానీ మాస్టర్ (Jony mastar) , శేఖర్ మాస్టర్ (Sekhar master) అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు అంటూ వార్తలు రాగా.. దానిపై స్పందించిన జానీ మాస్టర్.. శేఖర్ మాస్టర్ తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు..అయితే జానీ మాస్టర్ భార్య , డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి (Sumalatha Devi) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఏకంగా 10 మంది సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఫిలిం ఫెడరేషన్ రంగంలోకి దిగి సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. జానీ మాస్టర్ నిర్మాతలకి వినతి పత్రం అందిస్తూ.. ఫిలిం ఫెడరేషన్ నిర్ణయాలు తమను ఇబ్బందికి గురిచేస్తున్నాయి అంటూ కోరిన విషయం తెలిసిందే.దీంతో మండిపడ్డ ఫిలిం ఫెడరేషన్ జానీ మాస్టర్ పై ఇండియా వైడ్ సస్పెన్షన్ కూడా విధిస్తామని హెచ్చరించింది. అంతేకాదు ఆయన పని చేసే చిత్రాలలో మిగతా 23 క్రాఫ్ట్ కి సంబంధించిన వర్కర్లు పాల్గొనకుండా బహిష్కరిస్తామని స్పష్టం చేసింది.
అయితే జూలై 19న కుదిరిన రాజీలో.. ఈ వివాద పరిష్కారానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ , ఫెడరేషన్ సభ్యులు, జానీ మాస్టర్ అలాగే అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతాతో కూడా ప్రత్యేక చర్చలు జరిపారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పడం వల్లే ఇలా అత్యవసర భేటీ నిర్వహించారు. అదే రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ ప్రతినిధులు, అసోసియేషన్ లోని సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. జానీ మాస్టర్ సుమలతలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపారు. పైగా రాజీనామా చేసిన పదిమంది సభ్యులతో కలుపుకొని వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు.
ఇక అంతా బాగుంది అనుకునే సమయంలో…సడన్గా జులై 26న ఫిలిం డాన్సర్ అసోసియేషన్ జనరల్ బాడీ లో మీటింగ్ జరిగింది. యూనియన్ సభ్యులందరూ కలిసికట్టుగా ఐక్యంగా చర్చించుకుని ముందుకు సాగాలని నిర్మాతల మండలి, ఫెడరేషన్ ప్రతినిధులు స్పష్టం చేసినా.. యూనియన్ అధ్యక్షుడు సుమలతా దేవికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల మధ్య డ్యాన్సర్ బాలు జూలై 25న డ్యాన్సర్ అసోసియేషన్ పై కోర్టులో కేసు దాఖలు చేశారు. తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ సూచించిన మార్గదర్శకాలను పక్కనపెట్టి జనరల్ బాడీ మీటింగ్ ఉన్నప్పటికీ కోర్టులో కేసు వేయడం వెనుక ప్రెసిడెంట్ సుమలత, జానీ మాస్టర్ హస్తం ఉందంటూ కొంతమంది డ్యాన్సర్లు విమర్శలు గుప్పించారు. ఇక జనరల్ బాడీ మీటింగ్ తర్వాత నేడు ఫిలిం ఫెడరేషన్ సుమలత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
also read:పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిన పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?
విషయంలోకి వెళ్తే.. డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ఉప ఎన్నికలను సస్పెండ్ చేస్తూ లేబర్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ఫెడరేషన్ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . రిజైన్ చేసిన సభ్యులను కలుపుకొని పోవాలి లేదా పూర్తి ఎన్నికలు నిర్వహించాలి అని ఫిలిం ఫెడరేషన్ అల్టిమేట్ జారీ చేసింది. అయితే సుమలత మాత్రం ఉప ఎన్నికలను ఆపడానికి రిజైన్ చేసిన కార్యవర్గ సభ్యులు కోర్టుకు వెళ్లకుండా ముందే కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో సుమలత ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా పరిగణిస్తూ ఫిలిం ఫెడరేషన్ ఒక లేఖ విడుదల చేసింది.
సినీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాలను పట్టించుకోకుండా.. అధికార దుర్వినియోగంతో సుమలత సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ? సుమలత తన తీరును మార్చుకోకపోతే ఫెడరేషన్ కౌన్సిల్ లో మీటింగ్ పెట్టి అందులో మెజారిటీ డ్యాన్సర్ సభ…