Hit and Run Case: సినిమాల ద్వారానే కాదు వ్యక్తిత్వంతో కూడా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు.. ఇలా హత్య కేసులో వార్తల్లో నిలవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. గతంలో అభిమానిని హత్య చేసి కన్నడ హీరో దర్శన్ (Darshan ) వార్తల్లో నిలిస్తే.. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో 21 ఏళ్ల యువత జీవితాన్ని నాశనం చేసింది ఒక నటి. అయితే తాజాగా ఈ విషయంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరి ఆ నటి ఎవరు? ఆ యువకుడు ఎవరు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
హిట్ అండ్ రన్ కేసు.. విద్యార్థిని ఢీ కొట్టిన నందిని కార్..
అసలు విషయంలోకి వెళ్తే.. గౌహతిలో 23 ఏళ్ల విద్యార్థిని బలిగొన్న హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ అస్సామీ నటి నందిని కశ్యప్ (Nandini Kashyap)అరెస్టయ్యారు. జూలై 25న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గౌహతిలోని దఖిమ్గావ్ ప్రాంతంలో నందిని నడుపుతున్న కారు.. విద్యార్థి సమియుల్ హక్ (21) ను ఢీ కొట్టింది. హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందిని అరెస్టు చేసినట్లు సమాచారం.
ఘటనలో 21 ఏళ్ల విద్యార్థి మృతి..
ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. జూలై 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయిన సమియుల్.. ఈ ఘటన జరగడానికి కొంత సమయం ముందే చివరి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న సమియుల్ గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ (GMC) లో తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ఘటన జరిగిన వెంటనే గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH) లో సమియుల్ ను చేర్పించగా.. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఆయనను అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఇక మృత్యువుతో పోరాడుతూ సమియుల్ తుది శ్వాస విడిచారు.
పారిపోయే ప్రయత్నం చేసిన నటి నందిని..
ఈ ప్రమాదంలో నందిని కశ్యప్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. ప్రముఖ అస్సాం నటి నందిని కశ్యప్ ను సోమవారం డిస్పూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు విచారించారు. అయితే ఆమె తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ.. సంఘటనా స్థలం నుండి పారిపోవాలనే ప్రయత్నం చేసింది. దీనికి తోడు స్పష్టమైన సమాధానాలు లేకపోవడంతో విమర్శలకు దారితీసాయి. ఇక పరిస్థితి తీవ్రతను తాను గ్రహించలేదు అని.. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని ఆ తర్వాతే తనకు తెలిసిందని తెలిపింది. అంతేకాదు ఆ తర్వాత ఆమె బాధితుడి కుటుంబాన్ని కలవడం కోసం జి ఎం సి హెచ్ ను సందర్శించి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించినట్లు కూడా తెలిపింది.
హిట్ అండ్ రన్ కేసులో నటి నందిని అరెస్ట్..
ఇకపోతే అస్పష్టమైన సమాధానాలు చెబుతుండడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అస్సాం పోలీసులు.. AS 01FM 9199 రిజిస్ట్రేషన్ కలిగిన కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా మరోవైపు.. నిందితురాలు సెలబ్రిటీ హోదా కావడంతో దర్యాప్తులో అత్యవసర పరిస్థితి లోపించిందని మృతుడి కుటుంబం ఆరోపించింది. మేము న్యాయం మాత్రమే కోరుకుంటున్నాము ఆమె హోదా ఆమెను చట్టం నుండి రక్షించకూడదు అంటూ బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల పైకి అందరి దృష్టి మళ్లిందని చెప్పవచ్చు. ఇకపోతే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Rishab Shetty: కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన రిషబ్ శెట్టి.. ‘కాంతారా’కు మించి..