Vijay Devarkonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న తాజా చిత్రం కింగ్ డం(King Dom). స్పై యాక్షన్ డ్రామా మూవీగా రాబోతున్న ఈ సినిమా ఈ నెల 31వ తేదీ విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటలు సమయం ఉన్న నేపథ్యంలోనే చిత్రబృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇకపోతే తాజాగా నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఈయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..”సూరి చాలా కోపంగా ఉన్నాడు. కానీ మీ అందరి ప్రేమ, సపోర్ట్ వల్ల నేను ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను… రేపు సినిమాలో కలుద్దాం” అంటూ ఈయన ట్వీట్ చేశారు.
స్పై యాక్షన్ డ్రామాగా..
ఇలా ఈ ట్వీట్ షేర్ చేస్తూ రిలీజింగ్ టుమారో అంటూ సినిమాకు సంబంధించిన పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది అయితే ఒక సీక్రెట్ మిషన్ కోసం ఈయన తన ఉద్యోగం, కుటుంబాన్ని వదిలి అండర్ కవర్ ఆపరేషన్ మొదలు పెడతారు. అయితే సీక్రెట్ మిషన్ లో విజయ్ దేవరకొండ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? చివరికి ఆయన మాఫియా గ్యాంగ్ లీడర్ గా ఎలా మారారు? అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాన్ని కూడా తెలియజేయబోతున్నారని తెలుస్తుంది.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేసాయి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసింది. ఇక ఈ యాక్షన్ సినిమాకు అనిరుద్ (Anirudh)బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వర్క్ ఔట్ అయ్యిందని తెలుస్తోంది. గౌతం తిన్ననూరి (Gawtham Tinnanuri)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా విజయం పై విజయ్ దేవరకొండ కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈయన పెట్టుకున్న అంచనాలు చేరుకోగలరా ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూ హిట్ కొట్టగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Suri is filled with Rage.
But, me –
Today i am actually calm and content.
Because of your love 🥰Biggest hugs and love to all of you,
See you in the cinemas tomorrow ❤️#Kingdom https://t.co/vWnzGf6N6R pic.twitter.com/8QP8vcMzsk— Vijay Deverakonda (@TheDeverakonda) July 30, 2025
ఇకపోతే విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయని చెప్పాలి. ఈయన చివరిగా అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాల తర్వాత ఈ స్థాయిలో మరో సక్సెస్ రాలేదని చెప్పాలి. అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండకు మరో అర్జున్ రెడ్డి కాబోతుంది అంటూ చిత్ర బృందం ఇటీవల సినిమాపై అంచనాలను కూడా పెంచేశారు. ఇక చివరిగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి కింగ్ డం అయిన ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Rajkumar Rao: చిక్కుల్లో నటుడు రాజ్ కుమార్ రావు… నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!