Rishab Shetty:కాంతార(Kantara) సినిమాతో కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty)క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ‘కాంతారా’మూవీ ఏకంగా రూ.400 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించడమే కాదు స్వయంగా నటించారు కూడా. ఇక ఈ సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1(Kantara Chapter-1) ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.
రిషబ్ శెట్టి కొత్త మూవీ అనౌన్స్మెంట్..
అయితే కాంతారా చాప్టర్ 1 షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను కూడా అనౌన్స్ చేశారు రిషబ్ శెట్టి. తాజాగా నిర్మాత నాగవంశీ రిషబ్ శెట్టితో సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా చేస్తున్నట్టు ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.. నిర్మాత నాగ వంశీ (Naga Vamsi)తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు.. “అన్ని తిరుగుబాటులకు యుద్ధరంగం ఒక్కటే ఆధారం కాదు. కొన్ని కొన్ని యుద్ధాలు విధి చేత కూడా ఎంపిక చేయబడతాయి. ఇది ఒక తిరుగుబాటు దారుని కథ” అంటూ రిషబ్ శెట్టి కి సంబంధించి ఫోటో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలో రిషబ్ శెట్టి ఫేస్ కనిపించడం లేదు. అంతేకాదు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో కూడా చెప్పారు..
డైరెక్టర్ ఎవరంటే?
ఈ సినిమాకి అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) దర్శకత్వం వహిస్తున్నారని తెలియజేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ (Sitara Entertainments Banner)లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సాయి సౌజన్య(Sai Soujanya) అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్(Fortune 4 Cinemas) శ్రీకర స్టూడియోస్(Srikara Studios) ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నట్టు ఆ పోస్టులో తెలియజేశారు.. ప్రస్తుతం నాగ వంశీ షేర్ చేసిన ఈ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఒక తిరుగుబాటుదారుని పాత్రలో రిషబ్ శెట్టి కనిపించబోతున్నట్టు నాగ వంశీ పోస్టుతో అర్థమయింది. ఇక సినిమాకి సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే బయట పడతాయి.
రిషబ్ శెట్టి సినిమాలు..
అటు రిషబ్ శెట్టి కేవలం కాంతార చాప్టర్ 1 లో మాత్రమే కాకుండా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో హనుమాన్ (HanuMan) మూవీ కి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ (Jai HanuMan)మూవీ లో కూడా నటిస్తున్నారు.
also read:HBD Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే స్పెషల్ స్టోరీ మీకోసం!
Not all Rebels are forged in Battle. ⚔️
Some are chosen by Destiny
And this is that story of a Rebel..💥💥Proudly announcing @SitharaEnts Production No.36 with the versatile and dynamic @shetty_rishab garu. 🔥🔥
Directed by @AshwinGangaraju #SaiSoujanya @Fortune4Cinemas… pic.twitter.com/VDX3tjmwaT
— Naga Vamsi (@vamsi84) July 30, 2025